వ్యాధులు ప్రబలకుండా చర్యలు
ABN , First Publish Date - 2022-08-04T05:38:43+05:30 IST
మేయర్ సుంకర శివప్రసన్న కార్పొరేషన్, ఆగస్టు 3: వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ, అతిసారా వంటి వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని కార్పొరేషన్ మేయర్ సుంకర శివప్రసన్న అన్నారు. స్పెషల్ శానిటేషన్ డ్రైవ్‌లో భాగంగా 28,29 డివిజన్ల పరిధిలో అధికారులతో కలిసి
మేయర్ సుంకర శివప్రసన్న
కార్పొరేషన్, ఆగస్టు 3: వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ, అతిసారా వంటి వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని కార్పొరేషన్ మేయర్ సుంకర శివప్రసన్న అన్నారు. స్పెషల్ శానిటేషన్ డ్రైవ్‌లో భాగంగా 28,29 డివిజన్ల పరిధిలో అధికారులతో కలిసి బుధవారం ఆమె పర్యటించారు. పలుచోట్ల ప్రజలు తడి, పొడిచెత్త, హానికర వ్యర్థాలు కలిపి ఇస్తున్నట్టు గుర్తించామన్నారు. నగర పాలకసంస్థ వేర్వేరు డస్ట్‌బిన్‌లు సమకూర్చిన వాటిలో వేసి పారిశుధ్య కార్మికులకు అందించాలన్నారు. కమిషర్ రమేష్ మాట్లాడుతూ దోమలు వ్యాప్తి చెందకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో నగరపాలకసంస్థ అదనపు కమిషనర్ సీహెచ్ నాగనరసింహారావు, ఎంహెచ్‌వో పృథ్వీచరణ్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.