75 వేల పశువులకు టీకాలు

ABN , First Publish Date - 2022-09-25T06:17:57+05:30 IST

గొల్లప్రోలు రూ రల్‌, సెప్టెంబరు 24: జిల్లాలోని 75 వేల తెల్లజాతి పశువులకు లంపిస్కీన్‌ డిసీజ్‌ (ము ద్ద చర్మ వ్యాధి) టీకాలు వేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు పశుసంవర్థకశాఖ డిప్యూటీ డైరెక్టరు డాక్టర్‌ ఆర్‌.వెంకట్రావు తెలిపారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు, దుర్గాడల్లోని పశువైద్య

75 వేల పశువులకు టీకాలు
పశువైద్యశాలను తనిఖీ చేస్తున్న డీడీ వెంకట్రావు

గొల్లప్రోలు రూ రల్‌, సెప్టెంబరు 24: జిల్లాలోని 75 వేల తెల్లజాతి పశువులకు లంపిస్కీన్‌ డిసీజ్‌ (ము ద్ద చర్మ వ్యాధి) టీకాలు వేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు పశుసంవర్థకశాఖ డిప్యూటీ డైరెక్టరు డాక్టర్‌ ఆర్‌.వెంకట్రావు తెలిపారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు, దుర్గాడల్లోని పశువైద్యశాలలను ఆయన శనివారం తనిఖీ చేశారు. ఇప్పటికే 55వేల డోసులు అందుబాటులోకి తీసుకురాగా, మిగిలిన డోసులు అక్టోబరులో వస్తాయన్నారు. ఇప్పటికే 50శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయిందని, రెండోదశలో నల్లజాతి పశువులకు టీకాలు వేస్తామన్నారు. ప్రతి గ్రామంలోని ఆర్బీకేల వద్ద టీకాల కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. గొల్లప్రోలు, చేబ్రోలు, దుర్గాడ పశువైద్యశాలల్లో 10 టన్నుల గడ్డి విత్తనాలు అందుబాటులో ఉ న్నాయన్నారు. ఏడీ ముమ్మిడి శ్రీనివాసరావు, డాక్టర్‌ ని ర్మలకుమారి, డాక్టర్‌ హిమజ, డాక్టర్‌ ప్రశాంత్‌ ఉన్నారు.

Read more