8న కొమరిగిరిలో భూమిపూజ

ABN , First Publish Date - 2022-08-04T05:40:37+05:30 IST

కార్పొరేషన్‌, ఆగస్టు 3: నగర ప్రజల గృహ నిర్మాణ లబ్ధిదారులకు కొమరిగిరిలో కేటాయించిన ఇళ్ల స్థలాల్లో పెద్దఎత్తున గృహ నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు నగరపాలకసంస్థ కమిషనర్‌ కె.రమేష్‌ అన్నారు. బుధవారం ఆయన అధికారులతో నగరపాలకసంస్థ కార్యాలయంలో సమీక్షిం

8న కొమరిగిరిలో భూమిపూజ

కార్పొరేషన్‌, ఆగస్టు 3: నగర ప్రజల గృహ నిర్మాణ లబ్ధిదారులకు కొమరిగిరిలో కేటాయించిన ఇళ్ల స్థలాల్లో పెద్దఎత్తున గృహ నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు నగరపాలకసంస్థ కమిషనర్‌ కె.రమేష్‌ అన్నారు. బుధవారం ఆయన అధికారులతో నగరపాలకసంస్థ కార్యాలయంలో సమీక్షించారు. ఈనెల 8న వెయ్యిమంది లబ్ధిదారులకు ఎంపీ, ఎమ్మెల్యేలు, మేయర్‌ సమక్షంలో భూమిపూజ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారన్నారు. గృహ నిర్మాణశాఖ పీడీ పట్నాయక్‌, అదనపు కమిషనర్‌ సీహెచ్‌ నాగనరసింహారావు, డిప్యూటీ కమిషనర్‌ కోనా శ్రీనివాస్‌, ఎస్‌ఈ సత్యకుమారి, కార్యదర్శి ఏసుబాబు, డీపీఆర్వో కృష్ణమోహన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-04T05:40:37+05:30 IST