‘జగనన్న తోడు’తో 16,369 మందికి లబ్ధి
ABN , First Publish Date - 2022-08-04T05:43:42+05:30 IST
కాకినాడ సిటీ, ఆగస్టు 3: జగనన్న తోడు పథకం ద్వారా చిరు వ్యాపారులకు రూ.10వేల చొప్పున వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని, ఐదో విడత కాకినాడ జిల్లాలో మొత్తం 16,369 మంది లబ్ధిదారులకు రూ.16.36కోట్ల మేర లబ్ధి చేకూరిందని కలెక్టర్ కృతికాశుక్లా తెలిపారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుం చి సీఎం జగనన్న తోడు పథకం కింద ఐదో విడతలో చిరు వ్యాపారులు, సంప్రదాయ చేతి వృత్తులవారికి బ్యాం
కలెక్టర్ కృతికా శుక్లా
కాకినాడ సిటీ, ఆగస్టు 3: జగనన్న తోడు పథకం ద్వారా చిరు వ్యాపారులకు రూ.10వేల చొప్పున వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని, ఐదో విడత కాకినాడ జిల్లాలో మొత్తం 16,369 మంది లబ్ధిదారులకు రూ.16.36కోట్ల మేర లబ్ధి చేకూరిందని కలెక్టర్ కృతికాశుక్లా తెలిపారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుం చి సీఎం జగనన్న తోడు పథకం కింద ఐదో విడతలో చిరు వ్యాపారులు, సంప్రదాయ చేతి వృత్తులవారికి బ్యాంకుల ద్వారా రూ.10వేల చొప్పున వడ్డీ లేని రుణా లను అందించే కార్యక్రమాన్ని బుధవారం బటన్ నొక్కి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కలెక్టరేట్ నుంచి కలెక్టర్, జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, కాకినాడ మేయర్ సుంకర శివప్రసన్న, కుడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ పథకం ద్వా రా ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.10వేల చొప్పున బ్యాంకు ద్వారా అందుతున్న వడ్డీ లేని రుణాలతో చిరు వ్యాపారులు, సంప్రదాయ వృత్తిదారులకు ప్ర యోజనం కలుగుతుందన్నారు. ఐదో విడతలో జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన 9,955మంది లబ్ధిదారులకు రూ.9.95కోట్లు, పట్టణ ప్రాంతాలకు చెం దిన 6,414మంది లబ్ధిదారులకు రూ.6.41కోట్ల రుణా లు మంజూరయ్యాయని తెలిపారు. రుణాలు తిరిగి చెల్లించిన 38,561మంది లబ్ధిదారులకు రూ.61లక్షల వడ్డీ రీయింబర్స్ మొత్తాన్ని ఖాతాల్లో జమ చేశామన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ కె.శ్రీరమణి, మెప్మా పీడీ బి.ప్రియంవద ఉన్నారు. కలెక్టర్, ప్రజాప్రతినిధులు లబ్ధిదారులకు మెగా చెక్లు అందజేశారు.