‘ఇళ్ల లబ్ధిదారులు సిద్ధం కావాలి’

ABN , First Publish Date - 2022-12-31T00:20:47+05:30 IST

జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసేందుకు లబ్ధిదారులు సిద్ధం కావాలని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌ సీహెచ్‌ నాగనరసింహారావు అన్నారు. 32వ డివిజన్‌ రాగంపేట, రెల్లిపేట ప్రాంతాల్లోని గృహ నిర్మాణ లబ్ధిదారులతో కాంట్రాక్టర్లు, ఎమినిటీ కార్యదర్శుల సమక్షంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఇప్పటికే బేస్‌మెంట్‌ పూర్తిచేసిన లబ్ధిదారులు తదుపరి నిర్మాణ ప్రక్రియ కో

‘ఇళ్ల లబ్ధిదారులు సిద్ధం కావాలి’

కార్పొరేషన్‌ (కాకినాడ), డిసెంబరు 30: జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసేందుకు లబ్ధిదారులు సిద్ధం కావాలని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌ సీహెచ్‌ నాగనరసింహారావు అన్నారు. 32వ డివిజన్‌ రాగంపేట, రెల్లిపేట ప్రాంతాల్లోని గృహ నిర్మాణ లబ్ధిదారులతో కాంట్రాక్టర్లు, ఎమినిటీ కార్యదర్శుల సమక్షంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఇప్పటికే బేస్‌మెంట్‌ పూర్తిచేసిన లబ్ధిదారులు తదుపరి నిర్మాణ ప్రక్రియ కోసం అవసరమైన నిధులను సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ విషయంలో ప్రత్యేక అధికారులు, ఎమినిటీ కార్యదర్శులు లబ్ధిదారులను చైతన్యవంతం చేయాలన్నారు. సమావేశంలో డివిజన్‌ ప్రత్యేక అధిఽకారి రామశాస్త్రి, టీపీఆర్‌వో ఎం.కృష్ణమోహన్‌ పాల్గొన్నారు. నగరంలోని గొడారిగుంట బీసీ కాలనీలో ఇళ్ల నుంచి తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి అందిస్తున్న తీరును అదనపు కమిషనర్‌ పరిశీలించారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ లాజరస్‌, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T00:20:49+05:30 IST