యూజర్‌ చార్జీలపై ప్రత్యేక దృష్టి

ABN , First Publish Date - 2022-11-20T01:00:53+05:30 IST

మెరుగైన పారిశుధ్య నిర్వహణ కోసం వసూలు చేస్తు న్న యూజర్‌ చార్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌ సీహెచ్‌ నాగనరసింహరావు సంబంఽధిత ఉద్యోగులను ఆదేశించారు. స్మార్ట్‌సిటీ కార్యాలయంలో యూజ ర్‌ చార్జీల వసూళ్లపై శనివారం ఆయన సమీక్షించారు. ప్రజలకు మెరుగైన సేవలందించే లక్ష్యం తో ప్రతి ఇంటికి మూడు డస్ట్‌బిన్‌లతో పాటు ఇంటింటికి చెత్త సేకరణ

యూజర్‌ చార్జీలపై ప్రత్యేక దృష్టి

అదనపు కమిషనర్‌ నాగనరసింహరావు

కార్పొరేషన్‌ (కాకినాడ), నవంబర్‌ 19: మెరుగైన పారిశుధ్య నిర్వహణ కోసం వసూలు చేస్తు న్న యూజర్‌ చార్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌ సీహెచ్‌ నాగనరసింహరావు సంబంఽధిత ఉద్యోగులను ఆదేశించారు. స్మార్ట్‌సిటీ కార్యాలయంలో యూజ ర్‌ చార్జీల వసూళ్లపై శనివారం ఆయన సమీక్షించారు. ప్రజలకు మెరుగైన సేవలందించే లక్ష్యం తో ప్రతి ఇంటికి మూడు డస్ట్‌బిన్‌లతో పాటు ఇంటింటికి చెత్త సేకరణ కోసం ప్రత్యేక సిబ్బందిని, హూపర్‌ టిప్పర్‌ వాహనాలను సమకూర్చామన్నారు. వీటి నిర్వహణకు నెలకు రూ.56 లక్షలు ఖర్చవుతోందన్నారు. ఈ సొమ్మును యూజర్‌ చార్జీల ద్వారా వచ్చిన ఆదాయంతోనే సమకూర్చుకోవాల్సి ఉందన్నారు. ఇందుకు సాధారణ ప్రాంతాల్లో రూ.90, మురికివాడల్లో రూ.30 చొప్పున వసూలు చేయాలన్నారు. కార్పొరేషన్‌ డిప్యూటీ కమిషనర్‌ కోన శ్రీనివాస్‌, హెల్తాఫీసర్‌ ఫృఽధ్వీఛరణ్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

అభివృద్ధికి పన్నులే ఆధారం

నగర అభివృద్ధికి పన్నులే ఆధారమని అదనపు కమిషనర్‌ నాగనరసింహరావు అన్నారు. స్మార్ట్‌సిటీ కార్యాలయంలో ఆస్తి, నీటి, ఖాళీ స్థలా ల పన్నుల వసూళ్లపై ఆయన సమీక్షించా రు. డిప్యూటీ కమిషనర్‌ కోన శ్రీనివాస్‌, పాల్గొన్నారు.

Updated Date - 2022-11-20T01:00:55+05:30 IST