అర్పీలు క్రియాశీలకంగా వ్యవహరించాలి: ఏడీసీ

ABN , First Publish Date - 2022-08-05T05:23:14+05:30 IST

కార్పొరేషన్‌, ఆగస్టు 4: గృహనిర్మాణ లబ్ధిదారులుగా ఉన్న స్వయం సహాయక సంఘాల సభ్యులను ప్రోత్సహించి వీరికి అవసరమైన తోడ్పాటును అందించడంలో ఆర్పీలు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని కార్పొరేషన్‌ అదనపు కమిషనర్‌ నాగనరసింహారావు సూచించారు. స్మార్ట్‌సిటీ కార్యాలయంలో గురువారం ఆర్పీలతో ఈ అంశంపై సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ మెప్మా ద్వారా

అర్పీలు క్రియాశీలకంగా వ్యవహరించాలి: ఏడీసీ

కార్పొరేషన్‌, ఆగస్టు 4: గృహనిర్మాణ లబ్ధిదారులుగా ఉన్న స్వయం సహాయక సంఘాల సభ్యులను ప్రోత్సహించి వీరికి అవసరమైన తోడ్పాటును అందించడంలో ఆర్పీలు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని కార్పొరేషన్‌ అదనపు కమిషనర్‌ నాగనరసింహారావు సూచించారు. స్మార్ట్‌సిటీ కార్యాలయంలో గురువారం ఆర్పీలతో ఈ అంశంపై సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ మెప్మా ద్వారా చేపట్టే కార్యక్రమాలతో పాటు గృహ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. ఈనెల 8న రెండోవిడత 1000మందితో కొమరిగిరిలో జరిగే భూమిపూజ కార్యక్రమానికి లబ్ధిదారులు విధిగా హాజరయ్యేలా చొరవ తీసుకోవాలని కోరారు. మెప్మా పీడీ ప్రియంవద, టీపీఆర్వో మానే కృష్ణమోహన్‌, ఆర్పీలు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-05T05:23:14+05:30 IST