కడియం పూలమార్కెట్‌కు చవితి శోభ
ABN , First Publish Date - 2022-08-31T06:12:27+05:30 IST
వినాయకచవితిని పురస్కరించుకుని కడియపులంక అంతరాష్ట్ర పూలమార్కెట్‌లో సందడి నెలకొంది. ముహూర్తాలు లేక నిన్నటి వరకు సాధారణంగా ఉన్న పూల ధరలు ఒక్కసారిగా పెరిగాయి.
కడియం, ఆగస్టు 30 : వినాయకచవితిని పురస్కరించుకుని కడియపులంక అంతరాష్ట్ర పూలమార్కెట్‌లో సందడి నెలకొంది. ముహూర్తాలు లేక నిన్నటి వరకు సాధారణంగా ఉన్న పూల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. మల్లెలు, జాజులు, కాగడాలు కేజీ వెయ్యి రూపాయలు ధర పలికాయి. చవితి రాకతో వివిధ ప్రాంతాల నుంచి పూలు కొనుగోలుకు కొనుగోలుదారులు కడియపులంక మార్కెట్‌కు చేరుకున్నారు. దీంతో కొనుగోలుదారులు, వ్యాపారులు, రైతులు, రిటైల్‌గా కొనుగోలు చేసే వ్యాపారులతో మార్కెట్ రద్దీగా మారింది. పూలధరలు ఇలా ఉన్నాయి. కాగడాలు రూ.1000, మల్లెలు రూ.1000, లిల్లీ రూ.200, జాజులు రూ. 1,000 చామంతి రూ. 300--350, వైట్ చామంతి రూ.300, నీలం చామంతి రూ.300, మేరీగోల్డ్ రూ.250, బంతి రూ. 80-90, రెడ్‌బంతి రూ. 70-80, డచ్ (20పూలు) రూ. 300, కనకంబరం బారు రూ.300, గులాబీలు (దేశవాళీ) 100 పూలు రూ.150, స్టార్‌గులాబీ రూ.300 ధర పలుకుతున్నాయి.