ఆహ్లాదం..ఆదమరిస్తే ప్రమాదం

ABN , First Publish Date - 2022-11-05T01:21:35+05:30 IST

సువిశాల సాగరతీరంలో సముద్ర అలల హోరు నుంచి వచ్చే చల్లని గాలులతో సూర్యారావుపేట సాగరతీరం సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కార్తీకమాసం కావడంతో కాకినాడ సాగరతీరం నిత్యం సందర్శకుల రద్దీతో నిండిపోతోంది.

ఆహ్లాదం..ఆదమరిస్తే ప్రమాదం

  • అందమైన సూర్యారావుపేట బీచ్‌లో పొంచి ఉన్న ప్రమాదాలు

  • ప్రతి ఏటా సముద్ర స్నానాలకు దిగి కొందరు మృత్యువాత

  • బీచ్‌లో లేని హెచ్చరిక బోర్డులు

సర్పవరం: సువిశాల సాగరతీరంలో సముద్ర అలల హోరు నుంచి వచ్చే చల్లని గాలులతో సూర్యారావుపేట సాగరతీరం సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కార్తీకమాసం కావడంతో కాకినాడ సాగరతీరం నిత్యం సందర్శకుల రద్దీతో నిండిపోతోంది. కార్తీక సమారాఽధనల కోసం జిల్లా నలుమూలల నుంచి ఇక్కడకు కుటుంబ సభ్యులతో తరలి వస్తుంటారు. బీచ్‌లో సముద్ర స్నానాలకు దిగిన వారంతా ఆనంద సాగరంలో తలమునకైపోతారు. ఆదమరపుగా ఉన్న సమయంలో కెరటాల ఉధృతిలో పడి గల్లంతయ్యే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. ఏటా ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. అటు సందర్శకులు అప్రమత్తంగా ఉండడంతోపాటు ఇటు బీచ్‌లో సందర్శకుల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉన్న కాకినాడ రూరల్‌ మండలం సూర్యారావుపేట బీచ్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలోనే కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి చేశాయి. వేసవి సెలవుల విరామం, వా రాంతపు సెలవుల్లో బీచ్‌లో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేందుకు వస్తూంటారు. సముద్ర స్నానాలు చేస్తుంటారు. సూర్యారావుపేట సముద్ర తీరం పరిస్థితి తెలియకపోవడంతో పర్యాటకులు, యువత, చిన్నారులు, పెద్దలు సముద్రంలో స్నా నాలకు దిగడంతో చేజేతులా ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. నేమాం బీచ్‌ నుంచి వాకలపూడి బీచ్‌ వరకు సుమారు 7 కిలోమీటర్ల పరిధి మేర ఈ బీచ్‌ ఉండడంతో పర్యాటకులు అధికంగా సూర్యారావుపేట బీచ్‌లో సముద్ర స్నానాలకు దిగుతుంటారు. యువత అత్యుత్సాహంతో సముద్రంలో లోతుకి వెళ్లి స్నానాలు చేయడం, కెరటాల తాకిడికి సముద్రపు ఇసుక జారిపోవడం, గోతుల్లో పడి మృత్యువాతపడుతున్నారు. మరికొంతమంది యువకులు మద్యం మత్తులో స్నానాలకు దిగి సముద్ర కెరటాల ఉధృతికి సముద్రంలో గల్లంతై అనంతరం మృతదేహాలై తేలుతున్నారు. సూర్యారావుపేట బీచ్‌లో సముద్రస్నానాలాచరిస్తూ ఏటా పదుల సంఖ్యలో సముద్రంలో గల్లంతై మృతి చెం దడం పరిపాటిగా మారింది. ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు ఆరుగురు సముద్రంలో స్నానాలు చేస్తూ మృతి చెందారు. సముద్రం ఒడ్డున ప్రమాదపు ప్రాంతాలు గుర్తించి హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదకరంగా మా రిందని పర్యాటకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సముద్ర తీరంలో ప్రమాదంగా ఉన్న ప్రాంతాల పరిస్థితిని తెలియజేసే వార్నింగ్‌ బోర్డులను పోలీసులు, అధికారులు ఏర్పాటు చేస్తే విషాద సంఘటనలు నివారించే అవకాశం ఉంటుందని, ఆ దిశ గా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఒకవేళ ప్రమాదం జరిగినా వెంటనే రక్షించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఏడాది అక్టోబరు 6న కాకినాడకు చెందిన కోవెల దుర్గాకిరణ్‌ (17), దుర్గాప్రసాద్‌ (18) విద్యార్థులు బీచ్‌లో సముద్రంలో స్నానం చేస్తుండగా కెరటాల ఉధృతికి గల్లంత య్యారు. అంతకుముందు ఎనిమిది నెలల కిందట సూర్యారావుపేట లైట్‌హౌస్‌ పేటకు చెందిన ఎని మిదేళ్ల విద్యార్థి సముద్రంలో స్నానానికి దిగి గల్లం తై మృత్యువాత పడ్డాడు. ఏడు నెలల కిందట కాకినాడ సూర్యనారాయణపురంనకు చెందిన 13 ఏళ్ల యువకుడు సముద్రంలో గల్లంతై మృతి చెందాడు.

  • విచక్షణ కోల్పోరాదు

ఆహ్లాదం కోసం బీచ్‌కు వచ్చే సందర్శకులు సముద్రంలో ఈతకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌ సీఐ సుమంత్‌ అన్నారు. సముద్ర తీరంలో ఆనందంగా గడపాలి. అంతేగాని అత్యు త్సాహంతో స్నానాలకు దిగి విలువైన ప్రాణాలు కోల్పోరాదు. కుటుంబ సభ్యులకు కడుపుకోత మిగల్చవద్దు. రద్దీ రోజుల్లో సాగరతీరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా మెరైన్‌ పోలీసులతో పటిష్ట బందోబస్తు, లౌడ్‌ స్పీకర్లతో హెచ్చరికలు, గజ ఈతగాళ్లతో అప్రమత్తం చేస్తున్నాం.

Updated Date - 2022-11-05T01:21:37+05:30 IST