6న పెద్దాపురంలో జాబ్‌మేళా
ABN , First Publish Date - 2022-03-05T05:50:16+05:30 IST
సామర్లకోట, పెద్దాపురం, పిఠాపురం ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈనెల 6న పెద్దాపురం ఎంఆర్ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్టు డీఆర్‌డీఏ అధికారులు తెలిపారు.
సామర్లకోట,
మార్చి 4: సామర్లకోట, పెద్దాపురం, పిఠాపురం ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ
యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈనెల 6న పెద్దాపురం ఎంఆర్ కళాశాలలో
జాబ్‌మేళా నిర్వహించనున్నట్టు డీఆర్‌డీఏ అధికారులు తెలిపారు. ప్రముఖ ఫార్మా
సంస్ధ మెట్రోకెమ్ ఫార్మా సంస్థ తరపున విశాఖ, హైదరాబాద్‌లో ఉపాధి అవకాశాలు
కల్పించేందుకు ఈ ఫార్మా సంస్థ ముందుకు వచ్చిందన్నారు. వివిధ కేటగిరీల్లో
ఎస్‌ఎ్‌ససీ నుంచి ఎమ్మెస్సీ ఉత్తీర్ణులైన వారు వయస్సు 18 నుంచి 28 ఏళ్లు
యువతీ, యువకులు హాజరుకావచ్చని తెలిపారు. మొత్తం 300 పోస్టులు భర్తీ
చేయనున్నట్టు చెప్పారు. జాబ్‌మేళాకు హాజరయ్యేవారికి ఉచిత భోజన సదుపాయాలు
కల్పిస్తామన్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉదయం 10 గంటలలోపు ఎంఆర్
కళాశాలకు హాజరుకావాలని వారు కోరారు.