నేటి నుంచి జగనన్న ఇళ్లు.. కన్నీళ్లు

ABN , First Publish Date - 2022-11-12T00:41:38+05:30 IST

జగనన్న ఇళ్లు పేదలందరికీ కన్నీళ్లు నినా దంతో ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకూ జిల్లా వ్యాప్తంగా జగనన్న మోసం ట్యాగ్‌తో జనసేన ప్రత్యేక కార్యక్రమం చేపట్టినట్టు జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్‌ ప్రకటించారు.

నేటి నుంచి జగనన్న ఇళ్లు.. కన్నీళ్లు
మాట్లాడుతున్న జనసేన జిల్లా అధ్యక్షుడు దుర్గేష్‌ చిత్రంలో ఇతర నాయకులు

అధిష్టానానికి సమస్యలపై నివేదిక

జనసేన జిల్లా అధ్యక్షుడు దుర్గేష్‌

రాజమహేంద్రవరం, నవంబరు 11(ఆంధ్రజ్యోతి) : జగనన్న ఇళ్లు పేదలందరికీ కన్నీళ్లు నినా దంతో ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకూ జిల్లా వ్యాప్తంగా జగనన్న మోసం ట్యాగ్‌తో జనసేన ప్రత్యేక కార్యక్రమం చేపట్టినట్టు జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్‌ ప్రకటించారు. రాజమహేంద్రవరంలోని ఆయన నివాసంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.12,13 తేదీల్లో టిడ్కో ఇళ్లు.. జగనన్న కాలనీలు పరిశీలించి వీడియోలు, ఫొటోలు తీసి, డిజిటల్‌ క్యాంపెయిన్‌తో అధిష్ఠానికి నివేదిక ఇస్తామని తెలిపారు.14వ తేదీన సామాజిక తనిఖీ పేరుతో ఆయా సచివాలయాలకు వెళ్లి జగనన్న కాలనీల పరిస్థితి..సమస్యలను తెలుసు కుని ఒక నివేదిక తయారు చేసి నాయకత్వానికి ఇస్తామని తెలిపారు.ఈ నివేదికతో అధినాయకత్వం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తుందన్నారు. సమావేశంలో పార్టీనేతలు అనుశ్రీ సత్యనారాయణ, మేడా గురుదత్తు, వై.శ్రీనివాస్‌, గంటా స్వరూప,శీలప్రకాష్‌, రాజేశ్వరి, అమీనాబేగం, బర్రే లక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - 2022-11-12T00:41:40+05:30 IST