కంటితుడుపుగా సాగిన కేంద్రమంత్రి పర్యటన
ABN , First Publish Date - 2022-03-05T05:59:10+05:30 IST
గోకవరం, మార్చి 4: దేవీపట్నం మండలం ఇందుకూరు నిర్వాసితకాలనీలో కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పర్యటన కేవలం కంటితుడుపుగా సాగిందని జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విమర్శించారు. గోకవరంలో టీడీపీ నాయకుడు బత్తుల సత్తిబాబు స్వగృహంలో శు
జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల
గోకవరం, మార్చి 4: దేవీపట్నం మండలం ఇందుకూరు నిర్వాసితకాలనీలో కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పర్యటన కేవలం కంటితుడుపుగా సాగిందని జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విమర్శించారు. గోకవరంలో టీడీపీ నాయకుడు బత్తుల సత్తిబాబు స్వగృహంలో శుక్రవారం విలేకర్ల సమావేశంలో నెహ్రూ మాట్లాడుతూ అఖిలపక్షం ఆదివాసీ సంఘాల నేతృత్వంలో ఢీల్లీలో జరిపిన ఆందోళన ఫలితం వల్లే కేంద్రమంత్రి పోలవరం నిర్వాసితులు, పునవాసకాలనీని సందర్శించారని పేర్కొన్నారు. ఇందుకూరు-1 పునరావాసకాలనీలో సీఎం జగన్, కేంద్రమంతి నిర్వాసితుల సమస్యలపై ఆరాతీయడం మంచి పరిణామమేనన్నారు. అయితే పునరావాస కాలనీలన్నీ సుందరవనంగా చేసినట్టు జగన్ కేంద్రమంత్రిని తప్పుదోవ పట్టించారన్నారు. కేంద్రమంత్రి నిర్వాసితకాలనీలకు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని వినియోగించుకోవడంలో విఫలమైందన్నారు. కాలనీ సమస్యలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లి తద్వారా అభివృద్ధికి సరిపడా నిధులు అడగటం మానేసి కాలయాపన చేశారన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి స్థాయిలో చేపట్టాలని నెహ్రూ ప్రభుత్వాన్ని డిమా ండ్ చేశారు. సమావేశంలో టీడీపీ మండల కన్వీనర్ మంగరాతి రాము, పాలూరి బోస్, గునుపేభరత్, మండిగ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.