ఇరిగేషన్‌ సర్కిల్‌ ఎస్‌ఈగా శ్రీనివాసరావు

ABN , First Publish Date - 2022-12-31T01:25:28+05:30 IST

ధవళేశ్వరం నీటిపారుదల శాఖ సర్కిల్‌ ఎస్‌ఈగా జి. శ్రీని వాసరావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇరిగేషన్‌ సర్కిల్‌ ఎస్‌ఈగా శ్రీనివాసరావు

ధవళేశ్వరం, డిసెంబరు 30: ధవళేశ్వరం నీటిపారుదల శాఖ సర్కిల్‌ ఎస్‌ఈగా జి. శ్రీని వాసరావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గోదావరి డెల్టా సిస్టమ్‌ డిప్యూటీ సీఈగా విధులు నిర్వహిస్తున్న ఈయనను పుల్‌ అడిషనల్‌ చార్జ్‌ ఇస్తూ సర్కిల్‌ ఎస్‌ఈగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు పోలవరం హెడ్‌ వర్క్‌ సర్కిల్‌ ఎస్‌ఈగా పని చేస్తున్న కె.నరసింహమూర్తి ఇరిగేషన్‌ సర్కిల్‌ ఎస్‌ఈగా అదనపు బాధ్యతలు నిర్వహించారు.

Updated Date - 2022-12-31T01:25:30+05:30 IST