మాతా,శిశు మరణాలకు తావులేకుండా చర్యలు చేపట్టాలి

ABN , First Publish Date - 2022-03-05T06:03:02+05:30 IST

కొత్తపల్లి, మార్చి 4: పీహెచ్‌సీ పరిధిలో గర్భిణులు, బాలింతలకు ఆరోగ్యపోషణ సేవలను సక్రమంగా అందించి తద్వారా మాతా,శిశు మరణాలకు తావులేకుండా చర్యలు చేపట్టాలని ఇన్‌చార్జి డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ ఆర్‌ శ్రీనివాసనాయక్‌ సూచించారు. కొత్తపల్లి ప్రాథమిక వైద్య,

మాతా,శిశు మరణాలకు తావులేకుండా చర్యలు చేపట్టాలి

ఇన్‌చార్జి డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో

కొత్తపల్లి, మార్చి 4: పీహెచ్‌సీ పరిధిలో గర్భిణులు, బాలింతలకు ఆరోగ్యపోషణ సేవలను సక్రమంగా అందించి తద్వారా మాతా,శిశు మరణాలకు తావులేకుండా చర్యలు చేపట్టాలని ఇన్‌చార్జి డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ ఆర్‌ శ్రీనివాసనాయక్‌ సూచించారు. కొత్తపల్లి ప్రాథమిక వైద్య,ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) పరిధిలో ఏఎన్‌ఎం, ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలకు శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడా రు. చిన్నారులు ఆరోగ్యవంతంగా ఉండేందుకు ఐరన్‌ సిరఫ్‌ పట్టి ంచే విధంగా తల్లులను చైతన్యవంతం చేయాలని సూచించారు. యువతుల్లో రక్త హీనత నివారించేందుకు ఐరన్‌ మాత్రలు పంపిణీ చేయాలన్నారు. సమావేశంలో పీహెచ్‌సీ వైద్యాధికారి కుసుమమౌనిక, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ కృష్ణారావు పాల్గొన్నారు.

Read more