వైసీపీ ప్రభుత్వంలో బలహీనవర్గాలకు అన్యాయం

ABN , First Publish Date - 2022-03-05T06:48:46+05:30 IST

వైసీపీ ప్రభుత్వంలో బలహీన వర్గాలవారు దగా పడ్డారని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యా రావు ఆవేదన వ్యక్తం చేశారు.

వైసీపీ ప్రభుత్వంలో బలహీనవర్గాలకు అన్యాయం

రాజోలు, మార్చి 4: వైసీపీ ప్రభుత్వంలో బలహీన వర్గాలవారు దగా పడ్డారని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యా రావు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం తాటిపాకలో ఆయన స్వగృహం వద్ద రాజోలు నియోజకవర్గ టీడీపీ అగ్నికుల క్షత్రియ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన  సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ హయాంలో మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు బలహీ నవర్గాల  అభివృద్ధికి ఎన్నో పథకాలు అమలు చేశార న్నారు.  అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గాల కష్టాలను దృష్టిలో పెట్టుకుని వారి జీవనాధారంగా ఉపయోగపడే వలలు, బోట్లు, ఇంజ ను బోట్లు, చేపలు స్టోరేజ్‌ బ్యాక్సు లను ఉచితంగా ఇచ్చార న్నారు. వేట విరామ సమయంలో ప్రతి కుటుంబానికి రూ.4500 ఇచ్చేవారని తెలిపారు. ఆదరణ పథకం, బీసీ కార్పొరేషన్‌ ద్వారా సబ్సిడీ లోన్లు  ఇచ్చి బలహీన వర్గాలకు ఆర్థిక పురిపుష్టి కలగచేసిన నాయకుడు చంద్రబాబు అని గొల్లపల్లి పేర్కొన్నారు. కార్యక్రమంలో శంకరపు ఆదినారా యణ, కొల్లు మహలక్ష్మి, లంకే ప్రసాద్‌, బర్రే వెంకటరమణ, పోతాబత్తుల రాంబాబు, బొమ్మిడి నాగరాజు, పొన్నమండ నూకాలు, లంకే నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. Read more