స్వచ్ఛ గ్రామాల్లో చక్కటి పారిశుధ్యం అవసరం

ABN , First Publish Date - 2022-09-10T06:42:51+05:30 IST

స్వచ్ఛ గ్రామాలకు చక్కటి పారిశుధ్యం అవసరమని, ఆ దిశగా గ్రామం ప్రవేశం వద్ద డస్ట్‌బిన్స్‌ ఏర్పాటు ఆవశ్యకత ఎంతైనా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అధికారులకు సూచించారు.

స్వచ్ఛ గ్రామాల్లో చక్కటి పారిశుధ్యం అవసరం

కె. గంగవరం, సెప్టెంబరు 9: స్వచ్ఛ గ్రామాలకు చక్కటి పారిశుధ్యం అవసరమని, ఆ దిశగా గ్రామం ప్రవేశం వద్ద డస్ట్‌బిన్స్‌ ఏర్పాటు ఆవశ్యకత ఎంతైనా  మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అధికారులకు సూచించారు. కెగంగవరంలో శుక్రవారం రాచంద్రపురం, కె.గంగవరం మండలస్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారులతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్‌ హిమాన్షుశుక్లాతో కలసి ఆయన సమీక్ష జరిపారు.  మంత్రి మాట్లాడుతూ రామచంద్రపురం మున్సిపాల్టీలో స్వచ్ఛసంకల్పం మంచి ఫలితాలు వస్తున్నాయని, ఆ దిశగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో డస్ట్‌బిన్‌ విధానం అవలంభించాలన్నారు. పంచాయతీ నిధులు వెచ్చించాలని డీపీవోకు సూచించారు. త్వరలో రామచంద్రపురం-ద్రాక్షారామ రోడ్డు పనులు ప్రారంభం అవుతాయన్నారు. రామచంద్రపురంలో రూ.80లక్షలతో రైతుబజార్‌ను త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు.

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: కలెక్టర్‌  

ప్రభుత్వ కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్‌ హిమాన్షుశుక్లా అధికారులను హెచ్చరించారు. వైద్యాధికారులు పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు తప్పనిసరిగా సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించాలన్నారు. ఈసందర్భంగా కలెక్టర్‌ శాఖల వారీగా అధికారులతో సమీక్ష జరిపారు. సమావేశంలో జేసీ ద్యానచంద్ర, రామచంద్రపురం ఆర్డీవో సింధుసుబ్రహ్మణ్యం, అధికారులు పాల్గొన్నారు.Read more