-
-
Home » Andhra Pradesh » East Godavari » in a farmera sector govenment-NGTS-AndhraPradesh
-
‘దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం’
ABN , First Publish Date - 2022-03-05T06:56:40+05:30 IST
రైతు భరోసా కేంద్రాలు, వలంటీర్ల ద్వారా వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ధాన్యం కొనుగోళ్లు విధానం దళారీ వ్యవస్థను ప్రోత్సహించే విధంగా ఉందంటూ తెలుగురైతు అమలాపురం పార్లమెంటు జిల్లాశాఖ అధ్యక్షుడు మట్టా మహలక్ష్మిప్రభాకరరావు హనుమాన్ జంక్షన్‌లో జరుగుతున్న రాష్ట్రస్థాయి టీడీపీ రైతు వర్క్‌షాపు ముగింపు సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టగా ఏకగ్రీవంగా ఆమోదించారు.

అమలాపురం రూరల్, మార్చి 4: రైతు భరోసా కేంద్రాలు, వలంటీర్ల ద్వారా వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ధాన్యం కొనుగోళ్లు విధానం దళారీ వ్యవస్థను ప్రోత్సహించే విధంగా ఉందంటూ తెలుగురైతు అమలాపురం పార్లమెంటు జిల్లాశాఖ అధ్యక్షుడు మట్టా మహలక్ష్మిప్రభాకరరావు హనుమాన్ జంక్షన్‌లో జరుగుతున్న రాష్ట్రస్థాయి టీడీపీ రైతు వర్క్‌షాపు ముగింపు సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టగా ఏకగ్రీవంగా ఆమోదించారు. రాష్ట్రంలో ప్రభుత్వం కొనుగోలు చేసిన రూ.3వేల కోట్ల ధాన్యం సొమ్మును వెంటనే రైతులకు చెల్లించాలని ప్రభాకరరావు ప్రవేశపె ట్టిన తీర్మానాన్ని సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది. మినుము, పెసర పంటలను మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని వర్క్‌షాపులో ఏకగ్రీవంగా తీర్మానించారు.