-
-
Home » Andhra Pradesh » East Godavari » impact new tax muncipalties-NGTS-AndhraPradesh
-
ప్రజలపై ఇంపాక్ట్ బాదుడు
ABN , First Publish Date - 2022-08-15T06:43:36+05:30 IST
ప్రజలనుంచి ఏదొక రూపంలో పన్నులు బాధేస్తూ ముక్కుపిండి వసూలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇంపాక్ట్ ఫీజు పేరుతో మరో బాదుడుకు సిద్ధమైంది. ప్రధాన రహదారుల చెంతన భవనాలు నిర్మిం చాలంటే ఇప్పటికే కడుతున్న ఫీజులకు అదనంగా మరింత సమర్పించుకోవాల్సిందే. పట్టణాలు, నగరాలతోపాటు పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో గ్రా మాల్లో దీన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో దాదాపు అన్ని ప్రాంతాల్లోని ప్రజలపై భారం పడనుంది. ఇంపాక్ట్ కారణంగా ప్రజలు ఏటా కోట్లాది రూపాయిలను ఫీజుల రూపంలో సమర్పించుకోవాల్సి ఉంటుంది.

- ప్రజలపై మరో కొత్త పన్ను
- భవన నిర్మాణాలు ఇక మరింత భారం
- వడ్డింపుల్లో తగ్గేదిలే అంటున్న రాష్ట్ర ప్రభుత్వం
- రహదారుల చెంతన నిర్మాణాలు చేపట్టాలంటే షాక్ తప్పదు
- 250మీటర్ల వరకూ ఇదే నిబంధన
పిఠాపురం, ఆగస్టు 14: ప్రజలనుంచి ఏదొక రూపంలో పన్నులు బాధేస్తూ ముక్కుపిండి వసూలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇంపాక్ట్ ఫీజు పేరుతో మరో బాదుడుకు సిద్ధమైంది. ప్రధాన రహదారుల చెంతన భవనాలు నిర్మిం చాలంటే ఇప్పటికే కడుతున్న ఫీజులకు అదనంగా మరింత సమర్పించుకోవాల్సిందే. పట్టణాలు, నగరాలతోపాటు పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో గ్రా మాల్లో దీన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో దాదాపు అన్ని ప్రాంతాల్లోని ప్రజలపై భారం పడనుంది. ఇంపాక్ట్ కారణంగా ప్రజలు ఏటా కోట్లాది రూపాయిలను ఫీజుల రూపంలో సమర్పించుకోవాల్సి ఉంటుంది.
నగరాలు, పట్టణాలతోపాటు పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో ఉన్న గ్రా మాల ప్రజలపై మరో అదనపు వడ్డింపు వడ్డిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఏటా ఆస్తి పన్ను పెంపు, కొత్తగా చెత్త పన్ను విధింపుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలపై ఇది మరో పిడుగులా పడింది. రహదారుల చెంతన నిర్మాణాలు చేపట్టేవారు ఇక కొత్తగా ఇంపాక్ట్ ఫీజు చెల్లించాలని పురపరిపాలనాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకనుంచి కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగరపంచాయతీలతోపాటు పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోకి వచ్చే గ్రామాల్లోని 60 అడుగులు, అంతకంటే అధిక వెడల్పు ఉన్న రహదారుల వెంబడి నూతనంగా భవనాలు నిర్మించుకునే వారు ప్రస్తుతం చెల్లిస్తున్న ఫీజులకు అదనంగా ఇంపాక్ట్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. చదరపు అడుగు నిర్మాణానికి మార్కెట్ విలువలో రెండు నుంచి 3శాతం లేదా కనిష్ఠంగా రూ.25 నుంచి రూ.100 వరకూ చెల్లించాల్సి ఉంటుంది. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, మాస్టర్ ప్లానుల్లో ఉన్న రోడ్లు, బైపాస్‌రోడ్లు, రింగ్‌రోడ్లు, ఇతర ప్రదాన రహదారులకు ఆనుకుని భవనాలు నిర్మిస్తున్న వారందరూ ఈ ఇంపాక్ట్ ఫీజు పరిధిలోకి వస్తారు. ఇప్పటికే ఉన్న రోడ్లతోపాటు నిర్మాణంలో ఉన్న రహదారులు, భవిష్యత్తులో రోడ్లు నిర్మించే చోట ఈ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
వడ్డన వీరికి..
60 అడుగులనుంచి 150 అడుగుల వరకూ వెడల్పు ఉన్న రహదారుల వెంబడి నిర్మించే పారిశ్రామికేతర వాణిజ్య భవనాలకు ఇంపాక్ట్ ఫీజును వర్తింపచేశారు. 150 అడుగుల కంటే అధికంగా వెడల్పు ఉన్న రహదారులకు ఇరువైపులా 250 మీటర్ల పరిధిలో నిర్మించే అన్నిరకాల భవనాలను ఈ ఫీజు పరిధిలోకి తీసుకువచ్చా రు. కేవలం పట్టణాలు, నగరా లు, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో ఉన్న గ్రామాల్లోనే ఈ ఫీజులు వసూలు చేస్తామని చెప్పినప్పటికీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇది దాదాపు కాకినాడ జిల్లా అంతటికీ వర్తిస్తుంది. కాకినాడ కార్పొరేషన్‌తోపాటు పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట, తుని పురపాలక సంఘాలు, గొల్లప్రోలు, ఏలేశ్వరం నగర పంచాయతీలతోపాటు కాకినాడ పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలోకి మిగిలిన మండలాలు అన్ని వస్తుండడంతో దాదాపు జిల్లాలోని ప్రజలందరిపై భారం పడనుంది.
ఇలా బాదేస్తారు
నగరపాలకసంస్థలను ప్రత్యేక కేటగిరీగా, పురపాలక సంఘాలు, నగరపంచాయతీలను మరో కేటగిరీగా, పట్టణాభివృద్ధి సంస్థల గ్రామాలనే వేరుగా వర్గీకరించి ఇంపాక్ట్ ఫీజును బాదేశారు. మార్కెట్ విలువలో రెండు నుంచి మూడు శాతం లేదా చదరపు అడుగు నిర్మాణానికి ఇంత అని వసూలు చేస్తామని ఉత్తర్వుల్లో చెప్పినా చివరలో చిన్న మెలిక పెట్టారు. ఏ విలువ ఎక్కువ అయితే దాన్ని వసూలు చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే రహదారుల చెంతన భూములు, స్థలాల మార్కెట్ విలువలను భారీగా పెంచిన నేపథ్యంలో ప్రజలపై భారీగా బారం పడనుంది.
60 అడుగులనుంచి 150 అడుగుల విస్తీర్ణం వరకూ వెడల్పు ఉన్న రహదారుల వెంబడి 500 చదరపు మీటర్ల పైబడిన స్థలంలో నిర్మించే పారిశ్రామికేతర వాణిజ్య భవనాలకు సంబంధించి నగరపాలక సంస్థల్లో మార్కెట్ విలువలో 3శాతం లేదా చదరపు అడుగుకు రూ.100, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల పరిధిలో మార్కెట్ విలువలో 2శాతం లేదా చదరపు అడుగుకు రూ.75, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోని గ్రామాల్లో మార్కెట్ విలువలో 2శాతం లేదా చదరపు అడుగుకు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. 500 చదరపు మీటర్ల లోపు స్థలంలో నిర్మించే పారిశ్రామికేతర వాణిజ్య భవనాలకు సంబంధించి నగరపాలక సంస్థల్లో మార్కెట్ విలువలో 2శాతం లేదా చదరపు అడుగుకు రూ.50, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల పరిధిలో అయితే మార్కెట్ విలువలో 2శాతం లేదా చదరపు అడుగుకు రూ.50, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోని గ్రామాల్లో మార్కెట్ విలువలో 2శాతం లేదా చదరపు అడుగుకు రూ.25 చెల్లించాల్సి ఉంటుంది.
ఫ 150 అడుగుల కంటే ఎక్కువ వెడల్పు ఉన్న రహదారుల వెంబడి 250 మీటర్ల పరిధి వరకూ నిర్మించే నివాస భవనాలన్నింటికీ నగరపాలక సంస్థల్లో మార్కెట్ విలువలో 2శాతం లేదా, చదరపు అడుగుకు రూ.50, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల పరిధిలో అయితే మార్కెట్ విలువలో 2శాతం లేదా చదరపు అడుగుకు రూ.50, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోని గ్రామాల్లో మార్కెట్ విలువలో 2శాతం లేదా చదరపు అడుగుకు రూ.25 వంతున ఇంపాక్ట్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
పారిశ్రామికేత వాణిజ్య భవనాలకు సంబంధించి 500 చదరపు మీటర్ల పైబడిన స్థలంలో నిర్మించే పారిశ్రామికేతర వాణిజ్య భవనాలకు సంబంధించి నగరపాలక సంస్థల్లో మార్కెట్ విలువలో 3శాతం లేదా చదరపు అడుగుకు రూ.100, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల పరిధిలో మార్కెట్ విలువలో 2శాతం లేదా చదరపు అడుగుకు రూ.75, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోని గ్రామాల్లో మార్కెట్ విలువలో 2శాతం లేదా చదరపు అడుగుకు రూ.50, 500 చదరపు మీటర్ల లోపు స్థలంలో నిర్మించే పారిశ్రామికేతర వాణిజ్య భవనాలకు సంబంధించి నగరపాలక సంస్థల్లో మార్కెట్ విలువలో 2శాతం లేదా, చదరపు అడుగుకు రూ.50, పురపాలక సంఘాలు, నగరపంచాయతీల పరిధిలో అయితే మార్కెట్ విలువలో 2శాతం లేదా చదరపు అడుగుకు రూ.50, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోని గ్రామాల్లో మార్కెట్ విలువలో 2శాతం లేదా చదరపు అడుగుకు రూ.25 చెల్లించాల్సి ఉంటుంది.
ఇంత భారమా
పట్టణాలు, నగరాలు, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోని గ్రామాల్లో వాణిజ్య భవనాలు నిర్మించే వారిపై మోయలేని భారం పడుతుంది. ఇప్పటికే వీరు బిల్డింగ్ లైసెన్స్, బెటర్మెంట్ ఫీజు, డెవలప్మెంట్ చార్జీలు సహా పలు చార్జీలను చెల్లిస్తున్నారు. అదే నాన్‌లేఅవుట్ అయితే 14శాతం ఓపెన్ స్పేస్ చార్జీలు వసూలు చేస్తున్నారు. వీటికి అదనంగా ఇప్పుడు ఇంపాక్ట్ ఫీజు చెల్లించాల్సి రావడం మోయలేని భారంగా మారింది. ఈ ఫీజు ద్వారా వచ్చే మొత్తాలను ప్రత్యేకమైన ఖాతాలో వేసి రహదారుల విస్తరణ, అభివృద్ధి, జంక్షన్ల ఆధునికీకరణ, ఫ్లైఓవర్ల నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే పలు రకాల పన్నుల పేరుతో ప్రజలనుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్న ప్రభుత్వం మళ్లీ కొత్త పేరుతో బాదుడు సిద్ధమవ్వడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.