మెరుగైన రహదారుల నిర్మాణమే లక్ష్యం

ABN , First Publish Date - 2022-02-16T05:56:47+05:30 IST

పెద్దాపురం, ఫిబ్రవరి 15: మెరుగైన రహదారుల నిర్మాణమే లక్ష్యమని హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దవులూరి దొరబాబు తెలిపారు. పెద్దాపురం-

మెరుగైన రహదారుల నిర్మాణమే లక్ష్యం

హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దొరబాబు

పెద్దాపురం, ఫిబ్రవరి 15: మెరుగైన రహదారుల నిర్మాణమే లక్ష్యమని హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దవులూరి దొరబాబు తెలిపారు. పెద్దాపురం-వడ్లమూరు రహదారి విస్తరణకు ఆయన మంగళవారం శంకుస్థాపన చేశారు. రూ.90లక్షలతో నిర్మించే ఈ రహదారి విస్తరణ పనులను త్వరతిగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నెక్కంటి సాయిప్రసాద్‌, కౌన్సిలర్‌ త్సలికి సత్యభాస్కరరావు, జడ్పీటీసీ గవరసాన సూరిబాబు, ఆర్‌అండ్‌బీ జేఈ వెంకటరమణ పాల్గొన్నారు.

Read more