వైద్యం వికటించి బాలింత మృతి

ABN , First Publish Date - 2022-12-15T00:19:30+05:30 IST

అనపర్తిలోని ఏరియా ఆసుపత్రిలో వైద్యం వికటించి బాలింత మృతి చెందింది. మృతురాలి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని పెడపర్తికి చెందిన రాయి ఆదిలక్ష్మి (22) గర్భం దాల్చింది. ఆమె ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్నారు.

వైద్యం వికటించి బాలింత మృతి

అనపర్తి, డిసెంబరు 14 : అనపర్తిలోని ఏరియా ఆసుపత్రిలో వైద్యం వికటించి బాలింత మృతి చెందింది. మృతురాలి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని పెడపర్తికి చెందిన రాయి ఆదిలక్ష్మి (22) గర్భం దాల్చింది. ఆమె ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్నారు. గ్రామంలోని ఆశావర్కర్లు ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా వైద్య పరీక్షలు నమోదు కావాలని లేదంటే ప్రభుత్వం నుంచి అందే రాయితీలు రావని చెప్పడంతో ఇటీవల ఆదిలక్ష్మిని అనపర్తి ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చి వైద్యులకు చూపారు. ఆమెకు స్కానింగ్‌ నిర్వహించిన వైద్యులు బుధవారం ఆసుపత్రికి రావాలని చెప్పడంతో బుధవారం తల్లి మేరీతో ఆసుపత్రికి వచ్చింది. ఆదిలక్ష్మిని పరీక్షించిన గైనకాలజిస్టు లక్ష్మి ఆదిలక్ష్మికి వెంటనే ఆపరేషన్‌ నిర్వహించాలని చెప్పడంతో వెనువెంటనే ఆమెను థియేటర్‌కు తరలించి శస్త్రచికిత్స నిర్వహించారు. ఆమె ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే ఆదిలక్ష్మికి శస్త్రచికిత్స అనంతరం ఫిట్స్‌ రావడంతో వైద్యులు ఆమెను వెంటనే కాకినాడకు తరలించాలని సూచించి 108 సహాయంతో కాకినాడకు తరలించారు. అక్కడ వైద్యులు అప్పటికే ఆదిలక్ష్మి మృతి చెందిందని చెప్ప డంతో అక్కడి నుంచి మృతదేహాన్ని 108 వాహనంలో అనపర్తి ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆదిలక్ష్మి మృతికి వైద్యులే కారణమంటూ ఆసుపత్రి వద్ద బంధువులు ఆందోళనకు దిగారు. ఆపరేషన్‌ చేసేందుకు సరైన పరికరాలు లేవని ఆప రేషన్‌కు అవసరమైన మందులు, సామగ్రిని తమ చేతే బయట కొనిపించారని వారు ఆరో పించారు. అప్పటికే ప్రాణం పోయిన తమ కుమార్తెను కాకి నాడ తరలించి ఇక్కడి వైద్యులు చేతులు దులుపుకున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఆశా వర్కర్‌ మాటలు విని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చి తమ బిడ్డను చేతులారా చంపుకున్నామని వారు రోదిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు ఆసుపత్రికి చేరుకుని బంధువులతో చర్చించి వారి నుంచి వివరాలు సేకరించారు. ఆదిలక్ష్మి తల్లి మేరీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ తాడి రామగుర్రెడ్డి మాట్లాడుతూ ఉమ్మనీరు తగ్గిపోవడంతో ఆదిలక్ష్మికి అత్యవసరంగా శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చిందని శస్త్రచికిత్స అనంతరం ఆమెకు ిఫిట్స్‌ రావడంతో మెరుగైన వైద్యంకోసం కాకినాడ తరలించామని విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించామని దీనిపై పూర్తి విచారణ చేసి చర్యలు చేపడతామని అన్నారు.

Updated Date - 2022-12-15T00:19:31+05:30 IST