జీవనోపాధికి గండి కొట్టొద్దని మత్స్యకారుల వినతి

ABN , First Publish Date - 2022-08-04T06:56:23+05:30 IST

ఇందుపల్లి శివారు భట్నపాలెంలో దశాబ్దాల కాలంగా 280 మత్స్యకార కుటుం బాలు నివశిస్తున్నాయి.

జీవనోపాధికి గండి కొట్టొద్దని మత్స్యకారుల వినతి

దశాబ్దాల కాలంగా చేపల వేటే ఆధారం 

చేపల పెంపకం చేపట్టరాదని బోర్డు ఏర్పాటు

మత్స్యకారుల వినతితో స్పందించిన కలెక్టర్‌ 

విచారణ చేపట్టిన అధికారులు

అమలాపురం రూరల్‌, ఆగస్టు 3: ఇందుపల్లి శివారు భట్నపాలెంలో దశాబ్దాల కాలంగా 280 మత్స్యకార కుటుం బాలు నివశిస్తున్నాయి. శ్రీరామ ఫిషర్‌మెన్‌ అండ్‌ బోట్స్‌ మెన్‌ కోఆపరేటివ్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఇందుపల్లి, ఈదర పల్లి గ్రామాల పరిధిలో ఉన్న అప్పర్‌కౌశిక మేజర్‌ డ్రెయిన్‌ తునకచెరువులో సంప్రదాయ చేపల వేట సాగిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈడ్రెయిన్‌లో చేపల పెంపకం చేపట్టరా దని, ఎవరైనా అతిక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటా మని ఇటీవల తునకచెరువు వద్ద డ్రైనేజీశాఖ  బోర్డు ఏర్పాటు చేసింది. దీంతో స్థానిక మత్స్యకారులు ప్రజాప్రతి నిధులు, అధికారులను ఆశ్రయించారు. ఈనెల1న కలెక్టరే ట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆ  ప్రాంతానికి చెందిన వందలాది మంది మత్స్యకారులుకలెక్టర్‌ హిమాన్షు శుక్లాకు తమ గోడును విన్నవించారు.  పంచాయతీల పరిఽ దిలోని చెరువులను ఇప్పటికే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవ డంతో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పు డేమో అప్పర్‌ కౌశిక మేజర్‌ డ్రెయిన్‌ తునకచెరువులో చేపల పెంపకం చేపట్టరాదని బోర్డు ఏర్పాటు చేయడంతో తమ కుటుంబాలన్నీ రోడ్డున పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం స్పందించిన కలెక్టర్‌ హిమాన్షు శుక్లా డ్రైనేజీ, మత్స్యశాఖ ఉన్నతాధికారులను విచారణకు ఆదేశిం చారు. బుధవారం మత్స్యశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ షేక్‌ లాల్‌ మహ్మద్‌, డ్రెయినేజీ, ఇరిగేషన్‌శాఖ అధికారులు తున కచెరువు వద్దకు చేరుకుని విచారణచేపట్టారు.ఎవరో ఇచ్చిన ఫిర్యాదును ఆధారంగా ఏడు  దశాబ్దాలుగా చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్న తమకు అన్యాయం చేయవద్దని వేడు కున్నారు. కలెక్టర్‌ను కలసిన వారిలో సంఘ అధ్యక్ష, కార్యద ర్శులు ధర్మాడి వీర్రాజు, ధర్మాడి భవానీశం కర్‌, ధర్మాడి శ్రీను, ధర్మాడి ఏడుకొండలు, మల్లాడి ధనరాజులు ఉన్నారు.

నివేదికను కలెక్టర్‌కు అందిస్తాం: 

మత్స్యశాఖ జేడీ షేక్‌లాల్‌ మహ్మద్‌

అప్పర్‌ కౌశిక మేజర్‌ డ్రెయిన్‌ను ఆనుకుని సుమారు కిలోమీటరు పొడవు 300 మీటర్ల వెడల్పు ఉన్న తునక చెరువును పరిశీలించాం. కలెక్టర్‌ ఆదేశాలతో మత్స్యకారు లతో చర్చించాం. ఫ్లోటింగ్‌ ఉండే డ్రెయిన్‌ కాదది. అయితే సంబందిత నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామన్నారు.

జీవనోపాధిని దెబ్బతీయొద్దు: ధర్మాడి చినఏడుకొండలు

కోనసీమ చేపల వర్తక సంఘం అధ్యక్షుడు 

తాతల కాలం నుంచి తునకచెరువుపై ఆధారపడి మత్స్య కార కుటుంబాలు జీవిస్తున్నాయి. ఇప్పుడుచేపలు పెంచొద్దు అనడం అన్యాయం. మాకు ప్రత్యామ్నా య ఉపాధులు లేవు. చేపల పెంపకం, వేటకు అనుమతించి ఆదుకోవాలి. 



Updated Date - 2022-08-04T06:56:23+05:30 IST