రోజంతా వాన

ABN , First Publish Date - 2022-08-08T06:09:22+05:30 IST

అల్పపీడన ప్రభావంతో రాజమహేంద్రవరంలో ఆదివారం రోజంతా చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి. దీంతో రోడ్లన్నీ బురదతో చిత్తడి చిత్తడి మారాయి.

రోజంతా వాన
గోపాలపురంలో నీట మునిగిన పామాయిల్‌ తోట

చిత్తడిగా మారిన రోడ్లు.. ఇళ్లకే పరిమితమైన జనం


రాజమహేంద్రవరం అర్బన్‌/ సిటీ/ గోపాలపురం, ఆగస్టు 7 : అల్పపీడన ప్రభావంతో రాజమహేంద్రవరంలో ఆదివారం రోజంతా చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి. దీంతో రోడ్లన్నీ బురదతో చిత్తడి చిత్తడి మారాయి. ఎడతెరిపిలేకుండా కురిసిన జల్లులతో జనజీవనం అస్తవ్యస్తమైంది. అయితే ఆదివారం కావడం వల్ల ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు లేకపోయినా రైతుబజార్లు, మార్కెట్లకు వెళ్లేవారు, చర్చిలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లాలో శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం వరకు మొత్తం 686.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైం ది. అత్యధికంగా రాజమహేంద్రవరం అర్బన్‌లో 67.2 మిల్లీమీటర్లు కురిసింది. అత్యల్పంగా గోకవరం మండలంలో 3.0 మిమీ వర్ష పాతం నమోదైంది. సీతానగరం 13.2 మిమీ, కోరుకొండ 14.2 మి.మీ, రాజమహేంద్రవరం రూరల్‌ 45.2 మిమీ, రాజానగరం 31.8, రంగంపేట 5.6, బిక్కవోలు 14.8, అనపర్తి 39.0, కడియం 48.4 మిమీ వర్షపాతం నమోదై ంది. కొవ్వూరు డివిజన్‌లో తాళ్ళపూడిలో 35.2 మిమీ, గోపాలపురం 63.4, నల్లజర్లలో 21.4, దేవరపల్లి 56.4, కొవ్వూరు 61.6, చాగల్లు 49.0 , నిడదవోలు 37.2, ఉండ్రాజవరంలో 34.4, పెరవలిలో 45.4 మిమీ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల చేలు నీట మునిగాయి. ఎడతెరిపి లేని వానతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇంకనూ వరి సా..గు


కోరుకొండ/ రాజానగరం, ఆగస్టు 7 : ఈ ఏడాది ముందస్తుగా నాట్లు వేయాలని ప్రభుత్వం జూన్‌ ఆరంభంలోనే కాలువలు విడుదల చేసింది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇంకా వరి నాట్లు పడుతూనే ఉన్నాయి. అధిక వర్షాల కారణంగా  కోరుకొండ మం డలంలో ఇప్పటికే వరినాట్లు వేయడం ఆలస్యమైంది. గతేడాది ఆగస్టు మొదటి వారం నాటికి మండ లంలోని వరినాట్లు వేయడం పూర్తయింది. కానీ ఈ ఏడాది ఇంకా 50 శాతం వరినాట్లు వేయాల్సి ఉంది.   ముసురు కారణంగా నాట్లు వేసే కూలీలు రాక నాట్లు ఆలస్యమవుతున్నాయి. మునగాల, శ్రీరంగప ట్నం, కోటి, కాపవరం, బూరుగుపూడి, గుమ్ము  లూరు ప్రాంతాల్లో వరినారుమళ్లకు అధికనష్టం వాటి ల్లింది. ఏదో విధంగా అష్టకష్టాలు పడి నాట్లు వేద్దా మంటే ఇప్పుడు వర్షాలు ఆటంకం కలిగిస్తున్నా యని రైతులు వాపోతున్నారు.ఇక రాజానగరం మండలం కొండగుంటూరు, సంపత్‌ నగరం, నామ వరం, ముక్కినాడ, కొత్త తుంగపాడు, పాత తుంగపాడు, నరేంద్రపురం,వెలుగుబంద,పల్లకడియం,రాజా నగ రం,నందరాడ, కలవచర్ల గ్రామాల్లో కొంత భాగం బోరు నీటి ద్వారా సాగు చేస్తుండగా, మరి కొంత భాగం చాగల్నాడు కాలువ నీటి ద్వారా వరి సాగు జరుగుతోంది.ఏడాది అధిక వర్షాలతో చాగల్నాడు కాలువ నీరు రాకముందే వరి నాట్లు పడ్డాయి.  


Updated Date - 2022-08-08T06:09:22+05:30 IST