ఆహా..రం
ABN , First Publish Date - 2022-04-15T07:08:07+05:30 IST
గోదావరి మొదటి బ్రిడ్జి హేవలాక్ బ్రిడ్జి. గోదావరికి ఒక హారంలా భాసిల్లిన ఈ బ్రిడ్జి ఎన్నో సేవలందించి విశ్రాంతి తీసుకుంది. అప్పటి నుంచి దీన్ని ఒక స్మారక కట్టడంగా, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనేది ఇక్కడి ప్రజల కోరిక. చాలా ఏళ్లుగా ఈ డిమాండు ఉంది. గత టీడీపీ హాయాంలో ఈ బ్రిడ్జిని సుం దరంగా తీర్చిదిద్ది, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ప్రతిపాదనలు రెడీ చేసింది. ఈ బ్రిడ్జిని రైల్వేశాఖకు ఏకంగా రూ.10 కోట్లు చెల్లించి స్వాధీనం చేసుకుంది. ఈలోపు ఎన్నికలు రావడం తో కొంతకాలం ఈ ప్రతిపాదన మూలనపడింది. తాజాగా ఈ కోరిక నెరవేరే ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి.
రాజమహేంద్రవరం గోదావరి హేవలాక్ బ్రిడ్జిపై ఫుడ్ కియోస్క్
4 స్పాన్ల మేర షాపులు, ఈటరీ స్టాల్స్.. సిట్టింగ్ బెంచ్‌ల ఏర్పాట్లు
రూ.12 కోట్లతో టెండర్లు 8 దాఖలుకు 24న ఆఖరి గడువు
కాంట్రాక్టరులొస్తారో లేదో మరి 8 ఏర్పాటైతే మరో ఆభరణమే
నగరంలో రూ.125 కోట్లతో పలు అభివృద్ధి పనులకు జీవో
రెండు మూడుసార్లు టెండర్లు పిలిచినా ఎవరూ రాని వైనం
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
గోదావరి మొదటి బ్రిడ్జి హేవలాక్ బ్రిడ్జి. గోదావరికి ఒక హారంలా భాసిల్లిన ఈ బ్రిడ్జి ఎన్నో సేవలందించి విశ్రాంతి తీసుకుంది. అప్పటి నుంచి దీన్ని ఒక స్మారక కట్టడంగా, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనేది ఇక్కడి ప్రజల కోరిక. చాలా ఏళ్లుగా ఈ డిమాండు ఉంది. గత టీడీపీ హాయాంలో ఈ బ్రిడ్జిని సుం దరంగా తీర్చిదిద్ది, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ప్రతిపాదనలు రెడీ చేసింది. ఈ బ్రిడ్జిని రైల్వేశాఖకు ఏకంగా రూ.10 కోట్లు చెల్లించి స్వాధీనం చేసుకుంది. ఈలోపు ఎన్నికలు రావడం తో కొంతకాలం ఈ ప్రతిపాదన మూలనపడింది. తాజాగా ఈ కోరిక నెరవేరే ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి. రూ.12 కోట్లతో దీన్ని అభివృద్ధి చేయడంతోపాటు 4 స్పాన్ల మేర దీనిపై ఫుడ్ కియోస్క్, ఈటరీస్టాల్స్, షాపులు, ముగ్గురేసి కూర్చోవడానికి బెంచీలు నిర్మించడానికి డిజైన్ చేశారు. టెండర్లు పిలిచారు. ఈనెల 24వ తేదీ ఆఖరిరోజు. మరి ఎంతమంది ముందుకొస్తారో చూడాలి. ఎందుకంటే మున్సిపాల్టీలో కూడా పనులకు టెండర్లు పిలిచినా, కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడంలేదు. కానీ ప్రజల చిరకాల కోరికైన ఈ బ్రిడ్జిని పర్యాటక కేంద్రంగా మార్చ డం త్వరగా పూర్తవ్వాలని ప్రజలు కోరుతున్నారు. సుమారు 122 ఏళ్ల వయస్సున్న ఈ బ్రిడ్జిని కాపాడుకోవాలని స్థానిక ప్రజలు, రాజకీయనేతలు, వివిధ ప్రజాసంఘాలు ఎప్పటినుంచో పోరాడు తున్నాయి. రాజమహేంద్రవరం- కొవ్వూరు మధ్య గోదావరి మీద 1900లో హేవలాక్ బ్రిడ్జిని ప్రారంభించారు. నిర్మాణ తేదీతో కలు పుకుని 1997కు వందేళ్లు పూర్తవ్వగా, ఈ బ్రిడ్జిపై రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. ఈ బ్రిడ్జిని 2,754 మీటర్ల పొడవున 56 స్పాన్లను రాళ్లతోనూ, స్టీల్ గిర్డర్స్‌తోను నిర్మించారు. అప్పట్లో రైల్వేశాఖ దీనిని కూల్చేసి, స్టీల్‌ను అమ్మేసుకోవాలని ప్రయత్నిం చగా ప్రజలు అడ్డుకున్నారు. తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం దీనికోసం రైల్వేశాఖకు సుమారు రూ.10 కోట్ల వరకూ చెల్లించి స్వాధీనం చేసుకుంది. గత పుష్కరాల సందర్భంగా దీన్ని నైట్ బజార్‌గానూ, వాకింగ్‌ట్రాక్‌గానూ మార్చాలని ప్రయత్నించారు. అఖండగోదావరి టూరిజం ప్రాజెక్టులో భాగంగా డిజైన్లు కూడా తయారుచేశారు. తర్వాత ప్రభుత్వ మారడంతో ఎవరూ పట్టిం చుకోలేదు. ఎంపీ మార్గాని భరత్ కూడా ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు పనుల కోసం రూ.125 కోట్లు మం జూరు చేస్తూ 2021లో జీవో ఇచ్చింది. అందులో హేవలాక్ అభి వృద్ధికి రూ.12 కోట్లు కేటాయించారు. ఈమేరకు ఏపీ టూరిజం అధికారులు డిజైన్లు సిద్ధం చేసి టెండర్లు పిలిచారు. ఈ బిడ్ర్జి మీద రాజమహేంద్రవరం వైపు నుంచి సుమారు 200 మీటర్ల అంటే 4స్పాన్ల మేర 12 మీటర్ల వెడల్పున డెక్ నిర్మిస్తారు. దీని పై షాపులు, ఈటరీస్టాల్స్, ఫుడ్ కియోస్క్ తదితర నిర్మాణాలు చేయనున్నారు. ప్రజలు కూర్చోవడానికి వీలుగా రెండు వైపులా ముగ్గురు వంతున కూర్చొవడానికి వీలుగా బెంచీలు నిర్మించనున్నారు. కాంట్రాక్టర్లు ముందుకు వస్తే పని మొదలెడితే రాజమహేంద్రవరం నగరానికి ఇదో అదనపు ఆకర్షణ అవుతుంది. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్‌లో వివిధ శాఖల ద్వారా 17 పనులు చేయడానికి రూ.125 కోట్లను మంజూరుచేస్తూ గతేడాది డిసెం బరు 27 జీవో నంబరు 722ను జారీచేసింది. అందులో భాగంగా టూరిజం తర పున హేవలాక్ బ్రిడ్జికి రూ.12 కోట్లు కేటాయించారు. ఇది టెండర్లు పిలిచారు. శాప్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో స్టేడియం నిర్మాణానికి రూ.12 కోట్లు, నాగులచెరువు మార్కెట్ వద్ద ఫుడ్‌బాల్ గ్రౌండ్ నిర్మాణానికి రూ.5 కోట్లు, వీఎల్ పురంలోని మున్సిపల్ కార్పొరేషన్‌లో స్థలంలో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి రూ.23 కోట్లు, ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో పీవీ నరసింహారావు పార్కు, గౌతమీనందన వనం వద్ద రివర్ ఫ్రంట్ నిర్మాణానికి రూ.10 కోట్లు కేటాయించారు. వీటికి టెండర్లు పిలవనే లేదు. సరస్వతీఘాట్ వద్ద గోదావరి రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కోసం రూ.5 కోట్లు ఇచ్చారు. దీనికింకా ఇరిగేషన్‌శాఖ టెండర్లు పిలవలేదు. కోటగుమ్మం నుంచి మెయిన్‌రోడ్‌లోకి పాదచారుల వెళ్లడానికి రూ.5 కోట్లు, మల్టీలెవల్ కారు పార్కింగ్ కోసం రూ.5 కోట్లు.. ఇంకా పలు పనులకు కలిపి రూ.125 కోట్లు మం జూరు చేశారు. కొన్ని పనులకు రెండుసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు రాలే దు. హేవలాక్ ప్రాజెక్టు అయినా పూర్తి చేయాలని నగరవాసులు కోరుతున్నారు.