దారుణహత్య

ABN , First Publish Date - 2022-03-16T06:49:25+05:30 IST

మండపేట పట్టణంలో మంగళవారం మధ్యాహ్నం ఒకే సామాజిక వర్గానికి చెందిన రెండు వర్గాల మధ్య జరిగిన దాడుల్లో ఒక యువకుడు ప్రత్యర్థులు చేతిలో దారుణహత్యకు గురికాగా, మరో ముగ్గురు తీవ్రగాయాలపాలయ్యారు.

దారుణహత్య
ప్రత్యర్థుల చేతిలో హతమైన సందీప్‌.

 మండపేటలో ఇరువర్గాల మధ్య కొట్లాట

మారణాయుధాలతో దాడులు

ప్రత్యర్థుల చేతిలో యువకుడు హతం

 మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

పాతకక్షలే కారణమంటున్న పోలీసులు

మండపేట, మార్చి 15 : మండపేట పట్టణంలో  మంగళవారం మధ్యాహ్నం ఒకే సామాజిక వర్గానికి చెందిన రెండు వర్గాల మధ్య జరిగిన దాడుల్లో ఒక యువకుడు ప్రత్యర్థులు చేతిలో దారుణహత్యకు గురికాగా, మరో ముగ్గురు తీవ్రగాయాలపాలయ్యారు. పట్టణ పోలీసుల కథనం ప్రకారం మండపేటలోని బైపాస్‌ రోడ్డులో బుంగా సునీల్‌దత్‌ పాయిజన్‌ హోటల్‌ నిర్వహిస్తున్నాడు. ఏపీ ఎంజేఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు కూడా. సునీల్‌పై పాతకక్షల నేపథ్యంలో ప్రత్యర్థులు హత్యాయత్నం చేయగా తీవ్రగాయాలతో తప్పించుకోగా, అతడి బావమరిది కొమ్ము సందీప్‌ (25) ప్రత్యర్థుల దాడిలో హతమయ్యాడు. ఇదే ఘటనలో సందీప్‌ సోదరుడు సతీష్‌ కూడా గాయాలపాలయ్యాడు. తమ హోటల్‌లో పనులు ముగించుకుని సునీల్‌దత్‌తో కలి సి బైక్‌పై అతడి బావమరుదులు సందీప్‌, సతీష్‌లతో గుమ్మిలేరుకు మధ్యాహ్నం రెండు గంటల సమయం లో బయలుదేరారు. అంతకుముందు హోటల్‌ వద్ద  దత్‌ ప్రత్యర్థివర్గం తేజ, అతడి అనుచరులతో గొడవపడ్డారని సమాచారం. తర్వాత గుమ్మిలేరు బావమరుదులతో బైక్‌పై బయలుదేరిన దత్‌ టోల్‌గేట్‌ వద్ద బంకులో పెట్రోలు కొట్టించుకుంటుండగా కాపుకాసిన ప్రత్యర్థులు తేజ, అతడి అనుచరులు వెంటపడి మరణాయుధాలతో దాడికి పాల్పడగా దత్‌ పొలాలవైపు పరుగుతీశాడు. అదే సమయంలో దత్‌ బావమరిది సందీ ప్‌ని ప్రత్యర్థులు సిమెంట్‌ రేకులు, మరణాయుధాలతో దాడిచేయగా పెట్రోలు బంకు సమీపంలోని మురుగుకాల్వగట్టుపై దారుణహత్యకు గురయ్యాడు. మృతుడు శరీరంపైనా, మెడపైనా తీవ్రగాయాలు కనిపించాయి. మృతిచెందిన సందీప్‌కు భార్య, కుమార్తె ఉన్నారు. ఇదే సమయంలో బైక్‌పై వెళ్లేందుకు ప్రయత్నించిన సతీష్‌పె ౖకూడా ప్రత్యర్థులు దాడిచేయడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. అలాగే సునీల్‌దత్‌ కూడా తీవ్రగాయాలపాలయ్యాడు. ఇదే ఘటనలో చింతలూరుకి చెందిన ప్రత్యర్థి వర్గానికి చెందిన తేజ కూడా తీవ్రగాయాలపాలవడంతో తొలుత ఆలమూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, మెరుగైనవైద్యం కోసం ఆలమూరు పోలీసు లు రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఏపీ ఎమ్మార్పీ ఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు బుంగా సంజయ్‌ సోదరుడైన సునీల్‌దత్‌ ఏపీ ఎంజేఎఫ్‌ జిల్లా అధ్యక్షుడుగా పనిచేస్తున్నాడు. ఈఏడాది జనవరిలోనే బైపాస్‌రోడ్డులో ఈ హోటల్‌ను ప్రారంభించాడు. మం గళవారం హోటల్‌ వద్ద గొడవ జరగడం, ఈనెల 13న ఆలమూరు మండలం చింతలూరులో ఒక హోటల్‌ వద్ద ఇదే వర్గంతో జరిగిన ఘర్షణల నేపథ్యంలో ఆలమూరు పోలీసుస్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. కేసులు నమోదై మూడ్రోజులు కూడా గడవకముందే మంగళవారం దాడులకు దిగడం, దాడుల్లో ఒక యువ కుడు హత్యకు గురవ్వడం గమనార్హం. ప్రత్యర్థుల చేతి లో తీవ్రగాయాలపాలైన దత్‌, సతీష్‌లు మండపేట ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచా రం అందుకున్న రామచంద్రపురం డీఎస్పీ కె.బాలచంద్రారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో నెంబరులేని మోటారు సైకిల్‌ను గుర్తించారు. పాతకక్షలే కారణమా, లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణంలో పట్టణ ఇన్చార్జి సీఐ పి.శివగణేష్‌ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించా రు. సునీల్‌దత్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలివెల తేజ, చాపల వీరబాబు, పెందుర్తి కిషోర్‌, మదపల్లి చిన్నారి, లంక వినయ్‌, కొమ్ము నారాయుడులపై పట్టణ ఎస్‌ఐ ఆశోక్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Updated Date - 2022-03-16T06:49:25+05:30 IST