మాజీ ఎంపీ హర్షకుమార్ గృహ నిర్బంధం
ABN , First Publish Date - 2022-03-04T06:02:23+05:30 IST
ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతున్న అవీనితి అక్రమాలపై పోరాటం చేస్తున్న అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
రాజమహేంద్రవరం
సిటీ, మార్చి 3: ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతున్న అవీనితి అక్రమాలపై పోరాటం
చేస్తున్న అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ను పోలీసులు గృహ నిర్బంధం
చేశారు. చలో ఆంధ్ర యూనివర్సిటీ కార్యక్రమానికి పిలుపునిచ్చిన ఆయన గురువారం
ఉదయం రాజమహేంద్రవరం నుంచి విశాఖపట్నం బయలుదేరుతున్న సమయంలో పోలీసులు
నోటీసులు జారీ చేసి గృహనిర్బంధం చేశారు. దీనికి నిరసనగా తన గృహంలోనే
హర్షకుమార్ దీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీలో
అవినీతి జరుగుతుందని, కుల అహంకారంతో అక్రమాలకు పాల్పడుతున్నారని, దళిత,
గిరిజన విద్యార్థులపై దాడులు జరుగుతున్నాయన్నారు. డిగ్రీ అధ్యాపకులతో
యూనివర్సిటీలో పాఠాలు చెప్పించడం సిగ్గుచేటన్నారు. వర్సిటీలో ఖాళీ
పోస్టులను భర్తీ చేయాలన్నారు. ప్రభుత్వం స్పందించి ఆంధ్ర యూనివర్సిటీపై
విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే అకస్మాత్తుగా
యూనివర్సిటీని ముట్టడిస్తామని హెచ్చరించారు.
టీడీపీ ఆధ్వర్యంలో నిరసన
ఏయూలో
జరుగుతున్న అవినీతిపై విద్యార్థులు చేపట్టిన ఉద్యమాన్ని రాష్ట్ర ప్రభుత్వం
అణిచివేయడాన్ని నిరసిస్తూ టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆదిరెడ్డి
వాసు ఆధ్వర్యంలో స్థానిక నందం గనిరాజు సెంటర్‌లో ధర్నా చేశారు. విశాఖపట్నం
బయలుదేరిన తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా దేవివరప్రసాద్,
నగర అధ్యక్షుడు ఉల్లంకల లోకేశ్, పార్లమెంట్ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ
వెల్లంకి జయరామ్, టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకుడు సాయికు పోలీసులు 151 నోటీసులు
ఇచ్చి హౌస్ అరెస్టు చేయడాన్ని వాసు తప్పుబట్టారు.