ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి : జేసీ

ABN , First Publish Date - 2022-11-23T00:44:37+05:30 IST

రైతు భరోసా కేంద్రాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అల్లూరి సీతారామరాజు జి ల్లా జాయింట్‌ కలెక్టర్‌ శివశ్రీనివాస్‌ అన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి : జేసీ

రాజవొమ్మంగి నవంబరు 22: రైతు భరోసా కేంద్రాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అల్లూరి సీతారామరాజు జి ల్లా జాయింట్‌ కలెక్టర్‌ శివశ్రీనివాస్‌ అన్నారు. మండలంలోని జడ్డంగి రైతు భరోసా కేంద్రాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం రైతులతో సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోలు, రవాణా సమయంలో ఎదురయ్యే సమస్యలపై సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. జడ్డంగి గ్రామంలో నిర్మాణంలో ఉన్న మార్కెట్‌యార్డు భవనాన్ని, జీసీసీ పెట్రోల్‌ బంకు నిర్మాణ స్థలా న్ని ఆయన పరిశీలించారు. మండలంలోని మూడు సచివాలయాల్లోని ఆధార్‌ కేంద్రాలు పనిచేయడం లేదని పలువురు జేసీ దృష్టికి తీసుకురాగా అధికారులతో మాట్లాడి త్వరితగతిన సేవలు పునరుద్ధరించాలన్నారు. అనంతరం రాజవొమ్మంగి తహశీల్దార్‌ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. పౌరసరఫరాల శాఖ డీఎం గణేష్‌, తహశీల్దార్‌ వైవీ సుబ్రహ్మణ్యాచార్యులు, డిప్యూటీ తహశీల్దార్‌ అల్లు సత్యనారాయణ, సొసైటీ చైర్మన్‌ రామకృష్ణ, ఏవో రమేష్‌ ఉన్నారు.

‘గిట్టుబాటు ధర కల్పించాలి’

రంపచోడవరం, నవంబరు 22: ఏజెన్సీలో గిరిజన రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం డివిజన్‌ నాయకుడు పి.పాపన్న మంగళవారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలన్నారు. నాసిరకం విత్తనాలు, ఎరువులను నివారించాలన్నారు. గిరిజన రైతులకు బ్యాంకు రుణాలు మంజూ రు చేసి పనిముట్లను అందజేయాలన్నారు. దళారీ వ్యవస్థను సమూలంగా అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.

Updated Date - 2022-11-23T00:44:38+05:30 IST