జీవో 77ను రద్దు చేయాలి
ABN , First Publish Date - 2022-12-16T00:37:48+05:30 IST
పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తున్న జీవో 77 రద్దు చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూషణం డిమాండు చేశారు.
బొమ్మూరు, డిసెంబర్ 15: పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తున్న జీవో 77 రద్దు చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూషణం డిమాండు చేశారు. పీడీఎస్‌యూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం స్థానిక కలెక్టరేట్‌లో కలెక్టర్ మాధవీలతను కలిసి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. నాయకులు మట్లాడుతూ పెండింగ్ ఉన్న విద్య, వసతి దీవెన విడుదలలో ప్రభుత్వం జాప్యం చేస్తోందన్నారు. నాలుగో దఫాలో 40 శాతం పెండింగ్ వల్ల కళాశాల యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలని విద్యార్థులను ఒత్తిడి చేస్తున్నారని వివరించారు. వసతి గృహాల్లో ఉంటున్న పేద విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలని కోరారు. పేద విద్యార్థుల కంటే జైలులో ఉన్న ఖైదీలకీ ఆహార నిధులు ఎక్కువగా ఇస్తున్నారని కలెక్టర్ వద్ద వాపోయారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తిరుపతి రావు, ఏఐకేఎంఎస్ నాయకుడు సత్తిబాబు పాల్గొన్నారు.