-
-
Home » Andhra Pradesh » East Godavari » government buildings copmplete-NGTS-AndhraPradesh
-
‘ప్రభుత్వ భవనాల నిర్మాణాన్ని సత్వరం పూర్తి చేయాలి’
ABN , First Publish Date - 2022-06-07T07:02:34+05:30 IST
ప్రభుత్వ ప్రాధాన్యతలో భాగంగా చేపట్టిన భవనాల నిర్మాణాన్ని సత్వరం పూర్తిచేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు.

అమలాపురం, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ప్రాధాన్యతలో భాగంగా చేపట్టిన భవనాల నిర్మాణాన్ని సత్వరం పూర్తిచేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్‌నెస్ సెంటర్లు, డిజిటల్ లైబ్రరీ భవనాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని మండల స్థాయి అధికారులకు సూచించారు. అమలాపురంలోని కలెక్టరేట్ నుంచి సోమవారం ఆమర మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, వన్‌టైమ్ సెటిల్‌మెంట్, భూసర్వేలపై మండలాల వారీగా సమీక్షించారు. ఓటీఎస్ ద్వారా అర్హులకు రిజిస్ట్రేషన్లు పూర్తిచేసి గృహాలపై సంపూర్ణ హక్కు కల్పించాలన్నారు. జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణాలు వేగవంతం చేసేందుకు పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ హెచ్‌ఎం ధ్యానచంద్ర, డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, ఆర్డీవో ఎన్‌ఎస్‌వీబీ వసంతరాయుడు తదితరులు పాల్గొన్నారు.