‘గోకవరం మండలాన్ని కాకినాడ జిల్లాలో కలపొద్దు’

ABN , First Publish Date - 2022-02-02T05:55:50+05:30 IST

గోకవరం, ఫిబ్రవరి 1: గోకవరం మండలాన్ని కాకినాడ జిల్లాలో కలపవద్దని గోకవరం గ్రామానికి చెందిన పలు సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. మంగళవారం వేర్వేరుగా సమావేశమైన తాపీమేస్త్రీల సంఘం, నాయీబ్రాహ్మణ సంఘం సభ్యులు మాట్లాడుతూ కాకినాడ గోకవరానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని, రాజమహేంద్రవరం అయితే కేవలం 30 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుందని, దీని వల్ల వివిద పనుల కోసం

‘గోకవరం మండలాన్ని కాకినాడ జిల్లాలో కలపొద్దు’

గోకవరం, ఫిబ్రవరి 1: గోకవరం మండలాన్ని కాకినాడ జిల్లాలో కలపవద్దని గోకవరం గ్రామానికి చెందిన పలు సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. మంగళవారం వేర్వేరుగా సమావేశమైన తాపీమేస్త్రీల సంఘం, నాయీబ్రాహ్మణ సంఘం సభ్యులు మాట్లాడుతూ కాకినాడ గోకవరానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని, రాజమహేంద్రవరం అయితే కేవలం 30 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుందని, దీని వల్ల వివిద పనుల కోసం జిల్లా రాజమహేంద్రవరం వెళ్లడానికి సులువుగా ఉంటుందన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం గోకవరం మండలాన్ని రాజమహేంద్రవరం జిల్లాలో కలపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ తీర్మానం ఆమోదించారు. జనసేన జగ్గంపేట ఇన్‌చార్జి పాటంశెట్టి సూర్యచంద్రని కలిసి తాము చేస్తు న్న ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరారు.

Updated Date - 2022-02-02T05:55:50+05:30 IST