గోదావరిలో బాలుడి మృతి

ABN , First Publish Date - 2022-07-05T06:34:24+05:30 IST

వంగలపూడిలో గోదావరి స్నానానికి వెళ్లిన గొల్లపల్లి వీరబాబు (15) మృతిచెందాడు.

గోదావరిలో బాలుడి మృతి

 సీతానగరం, జూలై 4: వంగలపూడిలో గోదావరి స్నానానికి వెళ్లిన గొల్లపల్లి వీరబాబు (15) మృతిచెందాడు. సీతానగరం మండలం సింగవరంలోని బాదంశెట్టి కాలనీకి చెందినవీరబాబు అతని స్నేహితులతో కలిసి సోమవారం ఉదయం వంగలపూడిలో ఈతకు వెళ్లి మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఎస్‌ఐ శుభశేఖర్‌ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరబాబు సింగవరంలో అమ్మమ్మ వద్దనే ఉంటూ వంగలపూడి హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు.

Read more