గోదారి తగ్గింది.. బురద మిగిలింది..

ABN , First Publish Date - 2022-08-21T05:44:53+05:30 IST

గత వారం రోజులుగా నిలకడగా ప్రవహిస్తూ భయ పెడుతున్న గోదావరి శనివారం తగ్గుముఖం పట్టింది.

గోదారి తగ్గింది.. బురద మిగిలింది..
బురదమయంగా మారిన కొవ్వూరు గోష్పాదక్షేత్రం

కొవ్వూరు, ఆగస్టు 20 : గత వారం రోజులుగా నిలకడగా ప్రవహిస్తూ భయ పెడుతున్న గోదావరి శనివారం తగ్గుముఖం పట్టింది. గోదావరి ఘాట్లు నీటి నుంచి బయటపడ్డాయి. వరద తగ్గుముఖం పట్టడంతో  కొవ్వూరు గోష్పదక్షేత్రం బురదమయమైంది.ఆలయాల్లోను బురద చేరుకోవడంతో సిబ్బంది శుభ్రం చేసుకునే పనిలో పడ్డారు.గోష్పదక్షేత్రంలో అయ్యప్ప గుడి ఎదురుగా భక్తుల కోసం ఏర్పాటుచేసిన సిమెంటు బెంచీలు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. వరద ముంపుతో క్షేత్రం అంతా కకావికలంగా మారిందని భక్తులు ఆవేదన చెందుతున్నారు. వరద ముంపుతో క్షేత్రంలో చేరుకున్న బురదను భక్తుల సౌకర్యార్థం త్వరితగతిన తొలగించాలని భక్తులు కోరుతున్నారు.


Read more