జీవో 117 గందరగోళం

ABN , First Publish Date - 2022-08-04T05:57:29+05:30 IST

ప్రభుత్వం విద్యకు పెద్ద పీట వేస్తున్నామంటూనే.. జీవోల పేరుతో విద్యారంగంలో ఒడి దుడుకులు సృష్టిస్తోంది.

జీవో 117 గందరగోళం
జీవో 117కు వ్యతిరేకంగా జరిగిన బడి కోసం బస్సుయాత్రలో ఎమ్మెల్సీలు(ఫైల్‌)

విద్యా వ్యవస్థపై గొడ్డలి పెట్టు జీవో 117

మాతృభాషకు విద్యార్థులు దూరం

ఉపాధ్యాయ పోస్టులకు ఎసరే

ప్రభుత్వం తీరుపై సర్వత్రా విమర్శలు


నిడదవోలు, ఆగస్టు 3 : ప్రభుత్వం విద్యకు పెద్ద పీట వేస్తున్నామంటూనే.. జీవోల పేరుతో విద్యారంగంలో ఒడి దుడుకులు సృష్టిస్తోంది. ఈ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ కాస్తా అవస్థగా తయారైంది. ఏ సమయంలో ఎటువంటి జీవోలు విడుదల చేస్తారో.. ఏం నిర్ణయాలు తీసుకుం టారో తెలియక ఒక పక్క విద్యార్థుల తల్లిదండ్రులు.. మరో పక్క ఉపాధ్యాయులు అయోమయంలో కొట్టుమి ట్టాడుతున్నారు.జీవో నెం 117తో ప్రభుత్వ పాఠశాలల్లో విలీ నం, రేషనలైజేషన్‌ పేరుతో ఉపాధ్యాయులకు పని భారం, ఒకే మీడియంలో విద్యార్థులు చదవాల్సి రావడం తదితర కారణాలతో  ఇప్పటికే విద్యా వ్యవస్థ కునా రిల్లుతోంది.మేధావులంతా జీవో నెం.117ను రద్దు చేయా లని డిమాండ్‌ చేస్తున్నారు. 


సమస్యల జీవో..


రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో కొన్ని సవరణలకు జీవో నెం.117 జారీ చేసింది. దీని కారణంగా ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న 3,4,5 తరగతుల విద్యార్థుల ను కిలోమీటరు లోపు ఉన్న పాఠశాలల్లో విలీనం చేశా రు.మరో పక్క 6,7,8 తరగతుల్లో ఇంగ్లీష్‌ మీడి యంలోనే బోధనకు శ్రీకారం చుట్టారు. ప్రాథమిక పాఠశాలల విలీనంతో ఎందరో విద్యార్థులు హైస్కూల్‌ విద్యకు దూరమయ్యారు.హైస్కూల్‌లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. మరో పక్క 6,7,8 తరగతులను సింగిల్‌ మీడియం చేయడంతో ఇంగ్లీష్‌ మీడియంలో చదవలేక గ్రామీణ ప్రాంత విద్యార్థులు చదువులకు స్వస్తి చెబుతున్నారు.అమ్మ భాష తెలుగును విద్యా ర్థులకు దూరం చేయడంపై మేధావులు సైతం ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క 3,4,5 తరగతులను హైస్కూళ్లలో కలపడం ఉపాధ్యాయులకు అదనపు పనిభారంగా.. ఉపాధ్యాయుడు విద్యార్థుల నిష్పత్తి  1 ఇస్ట్‌ 60గా మార్చడం విద్యా హక్కు చట్టాన్ని వ్యతిరే కించడమేనని ఉపాధ్యాయులు సైతం పేర్కొంటున్నారు. ఉపాధ్యాయుల మెడపై జీవో నెం.117 కారణంగా భవి ష్యత్‌లో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసే పరిస్థితి కనిపించడం లేదని.. కొత్త డీఎస్సీ అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.  ప్రభుత్వం తక్షణం  జీవోను వెనక్కి తీసుకుని విద్యా రంగ అభివృద్దికి ప్రభుత్వం కృషి చేయాలని పలువురు విద్యారంగ ప్రముఖులు కోరుతున్నారు.


ఉపయోగం లేని జీవో


 జీవో నెం 117 ద్వారా రాష్ట్ర ప్రభు త్వం విద్యాశాఖను భ్రష్టు పట్టిం చాలని చూస్తుంది.ఈ జీవో ద్వారా  ఎటువంటి ప్రయోజనం లేదు. ఇప్పటికే డ్రాపవుట్లు గణనీయంగా పెరిగాయి. సింగిల్‌ ఇంగ్లీష్‌ మీడియం 6,7,8 తరగతులకు అమలు చేయడం ద్వారా చాలా పోస్ట్‌లు రేషనలైజేషన్‌లో పోయే అవకాశం ఉంది. ఆగస్టు నెలలోపు బదిలీలు, రేషనలైజేషన్‌, పదోన్నతులు పూర్తి చేస్తామని ప్రభుత్వం చెప్పినా ఆ దిశగా ప్రయ త్నాలేమీ జరగడం లేదు.  

- పిల్లి జయకర్‌, జిల్లా అధ్యక్షుడు, యూటీఎఫ్‌

Updated Date - 2022-08-04T05:57:29+05:30 IST