హామీ ఇచ్చి ముఖం చాటేసిన ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2022-12-31T22:43:52+05:30 IST
జి.శ్రీనివాస్‌నాయుడు ఎమ్మెల్యేగా గెలిచి అధికా రంలోకి రాగానే ఆర్టీసీ డిపోను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి నాలుగేళ్లు గడిచినా డిపో వైపు ముఖం చూపించలేదని ఆర్టీసీ డిపో సాధన సౌకర్యాల పోరాట సమితి కన్వీనర్ జువ్వల రాంబాబు అన్నారు. శనివారం నిడదవో లులోని ఆర్టీసీ డిపో వద్ద డిపో సాధన సౌకర్యాల పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
నిడదవోలు, డిసెంబరు 31: జి.శ్రీనివాస్‌నాయుడు ఎమ్మెల్యేగా గెలిచి అధికా రంలోకి రాగానే ఆర్టీసీ డిపోను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి నాలుగేళ్లు గడిచినా డిపో వైపు ముఖం చూపించలేదని ఆర్టీసీ డిపో సాధన సౌకర్యాల పోరాట సమితి కన్వీనర్ జువ్వల రాంబాబు అన్నారు. శనివారం నిడదవో లులోని ఆర్టీసీ డిపో వద్ద డిపో సాధన సౌకర్యాల పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ నిడదవోలు డిపో పాలకవర్గ నిర్లక్ష్యానికి గురవుతోందన్నారు. డిపోను అభివృద్ధి చేసి పక్కా భవనాలు నిర్మించి కొత్త బస్సు సర్వీసులను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎల్లే పండు, డొంక రమేష్, గెడ్డం కుమార్, నక్కా సురేష్, ప్రసన్న, నాని పాల్గొన్నారు.