ఘంటసాలకు మరణం లేదు..

ABN , First Publish Date - 2022-12-05T01:07:49+05:30 IST

ఘంటసాలకు మరణం లే దు.. ఆయన శ్రోతల్లో ఎప్పుడూ జీవిస్తూనే ఉంటారు..

ఘంటసాలకు మరణం లేదు..

ఘనంగా ఘంటసాల శతజయంత్యుత్సవం

ధవళేశ్వరం, డిసెంబరు 4 : ఘంటసాలకు మరణం లే దు.. ఆయన శ్రోతల్లో ఎప్పుడూ జీవిస్తూనే ఉంటారు.. ఆ గానం అజరామరం అని గోదావరి కల్చరల్‌ అసోసియేషన్‌ అధ్యక్ష కార్యదర్శులు జీవీ రమణ, యర్రమోతు ధర్మరాజు అన్నారు. అమరగాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటే శ్వరరావు శత జయంతోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. దీనిలోభాగంగా ధవళేశ్వరం ఇరిగేషన్‌ కార్యాలయం వద్ద ఉన్న ఘంటసాల విగ్రహానికి గోదావరి కల్చరల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పలువురు ప్రముఖు లు సంగీత అభిమానులు పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. అనంతరం 100 మంది విద్యార్థినులు ఘంటసా ల మధురగీతాలను ఆలపించారు. అసోసియేషన్‌ పుర ప్రముఖులు వేగిశెట్టి కోదండ రామారావు, గ్రంధి జగన్నా ఽథం, సావాడ శ్రీనివాసరెడ్డి తదితరులు ఘంటశాల గీతా లు ఆలపించింది మూడు దశాబ్దాలేనని కాని ఆయన పాట మాత్రం ఎల్లప్పుడూ తెలుగువారి గుండెల్లో మా ర్మోగుతూ ఉంటుందన్నారు. అనంతరం శతగళ స్వరార్చన లో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజే శారు.కార్యక్రమంలో బాలికోన్నత పాఠశాల ప్రధానో పాధ్యాయిని ఆర్‌.విజయదుర్గ, సంగీత ఉపాధ్యాయిని పద్మావతి, పి.కృష్ణమో హన్‌, టీఎస్‌.శేషుకుమార్‌, సత్యాగ్రహ రాజు, గాంధీరాజు, రామరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-05T01:07:50+05:30 IST