80 కిలోల గంజాయి పట్టివేత
ABN , First Publish Date - 2022-12-15T00:16:32+05:30 IST
కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో రూ.4లక్షలు విలువైన 80 కిలోల గంజాయిని బుధవారం ప్రత్తిపాడు పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో రూ.4లక్షలు విలువైన 80 కిలోల గంజాయిని బుధవారం ప్రత్తిపాడు పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రత్తిపాడు, డిసెంబరు 14: కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో రూ.4లక్షలు విలువైన 80 కిలోల గంజాయిని బుధవారం ప్రత్తిపాడు పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గంజాయి అక్రమ రవాణాపై అందిన సమాచారం మేరకు ఎస్పీ ఎం.రవీంద్రనాఽథ్‌బాబు ఆదేశాలతో అడిషనల్ ఎస్పీ పి.శ్రీనివాస్, పెద్దాపురం డీఎస్పీ ఎస్.మురళీమోహన్ పర్యవేక్షణలో ప్రత్తిపాడు సీఐ కె.కిషోర్‌బాబు ఆధ్వర్యంలో స్థానిక చెక్‌పోస్టు వద్ద ఆలయం ఎదుట జాతీయ రహదారిపై గంజాయి రవాణా చేస్తున్న ఆటోను పోలీసులు పట్టుకున్నారు. నర్సీపట్నం ఏజెన్సీ నుంచి పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలుకు అక్రమంగా రవాణా చేస్తున్న రూ.4లక్షల విలువైన 80 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పుణ్యక్షేత్రం గ్రామానికి చెందిన అత్తిలి నారాయణ స్వామిని అరెస్ట్ చేశారు. అతడి నుంచి సెల్‌ఫోన్ స్వాధీనపరుచుకున్నారు. సంఘటనా స్థలాన్ని ప్రత్తిపాడు తహశీల్దార్ పీవీవీ గోపాలకృష్ణ సందర్శించారు. ఈ సంఘటనలో ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నారని, నిందితుడి వద్ద నుంచి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్ రిమాండ్ విఽధించగా నిందితుడిని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు.