భవిష్యత్ నాశనం చేసేది వ్యసనమే
ABN , First Publish Date - 2022-12-16T00:39:01+05:30 IST
ప్రతి విద్యార్థి వ్యసనాలకు దూరంగా ఉం టూ లక్ష్య సాధనకు కృషి చేయాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం రిజి స్ట్రార్ ఆచార్య టి.అశోక్ అన్నారు. నన్నయ విశ్వవిద్యాలయం స్టూడెంట్ అఫైర్స్ ఆధ్వర్యంలో గురువారం యాంటీ ర్యాగింగ్, ఆల్కాహాలిజం అండ్ డ్రగ్ అబ్యూస్‌పై నిర్వహించిన అవగాహ సదస్సులో ఆయన మాట్లాడారు.
దివాన్‌చెరువు, డిసెంబరు 15: ప్రతి విద్యార్థి వ్యసనాలకు దూరంగా ఉం టూ లక్ష్య సాధనకు కృషి చేయాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం రిజి స్ట్రార్ ఆచార్య టి.అశోక్ అన్నారు. నన్నయ విశ్వవిద్యాలయం స్టూడెంట్ అఫైర్స్ ఆధ్వర్యంలో గురువారం యాంటీ ర్యాగింగ్, ఆల్కాహాలిజం అండ్ డ్రగ్ అబ్యూస్‌పై నిర్వహించిన అవగాహ సదస్సులో ఆయన మాట్లాడారు. వ్యస నమే విద్యార్థి భవిష్యత్ నాశనం చేస్తుందన్నారు. ఏఎస్పీ ఎం.రజనీ మాట్లా డుతూ తల్లిదండ్రుల కీర్తిప్రతిష్టలను పెంచే విధంగా విద్యార్థులు ఎదగాల న్నారు. మద్యపానం, డ్రగ్స్ జోలి కెళితే జీవితం నాశనమైపోతుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు షేక్ కాజా మహినుద్దీన్ మాట్లాడుతూ విద్యా ర్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని దానికి తగినట్టుగా సాధన చేసి లక్ష్యాలను చేరుకోవాలన్నారు. అనంతరం యాంటీ ర్యాగింగ్,ఆల్కహాలిజం అండ్ డ్రగ్ అబ్యూస్‌లకు సంబంధించిన బ్రోచర్‌లను ఆవిష్కరించారు. ముందుగా విద్యార్థులు సందేశాత్మకనాటకం ప్రదర్శించారు.