కొవిడ్‌ నిబంధనలు పాటించాలి: డీఎస్పీ

ABN , First Publish Date - 2022-12-31T01:14:53+05:30 IST

నూతన సంవత్సర వేడుకలను కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని డీఎస్పీ వీఎస్‌ఎన్‌ వర్మ అన్నారు. శుక్రవారం కొవ్వూరు డీఎస్పీ కార్యాలయంలో నిర్వహిం చిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లా డుతూ ఒమిక్రాన్‌ వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా ప్రతిఒక్కరూ మాస్క్‌, శానిటైజర్‌లతో పాటు సామాజిక దూరాన్ని పాటించాలన్నారు.

కొవిడ్‌ నిబంధనలు పాటించాలి: డీఎస్పీ

కొవ్వూరు, డిసెంబరు 30: నూతన సంవత్సర వేడుకలను కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని డీఎస్పీ వీఎస్‌ఎన్‌ వర్మ అన్నారు. శుక్రవారం కొవ్వూరు డీఎస్పీ కార్యాలయంలో నిర్వహిం చిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లా డుతూ ఒమిక్రాన్‌ వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా ప్రతిఒక్కరూ మాస్క్‌, శానిటైజర్‌లతో పాటు సామాజిక దూరాన్ని పాటించాలన్నారు. డిసెంబరు 31వ తేదీ రాత్రి 10 గంటల తర్వాత గుంపులుగా తిరగరాదని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం, రహదారులపై కేకులు కట్‌ చేయడం, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం చేయరాదన్నారు. ఒకటో తేదీన దేవాలయాలకు, మసీదులకు, చర్చిలకు వెళ్లేవారు క్రమశిక్షణ పాటించాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని, మోటారుసైకిళ్లపై ఇద్దరికంటే ఎక్కువ ప్రయాణించొద్దని, బాణాసంచా కాల్చొద్దని, లౌడ్‌స్పీకర్లు వినియోగించొద్దని డీఎస్పీ పేర్కొన్నారు. కోడి పందాలు, పేకాట, రికార్డింగ్‌ డ్యాన్స్‌ నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Updated Date - 2022-12-31T01:14:54+05:30 IST