అల్లర్లు దురదృష్టకరం.. కేసుల నుంచి విముక్తి కల్పిస్తాం!
ABN , First Publish Date - 2022-08-14T07:41:09+05:30 IST
కోనసీమ జిల్లా పేరు మార్పు సమయంలో అమలాపురంలో జరిగిన అల్లర్లు దురదృష్టకరం. ఈ కేసుల్లో ఇరుకుక్కన్న అమాయకులైన వారికి కేసుల నుంచి విముక్తి కల్పిస్తామని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చెప్పారు.

ఎంపీ సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్సీ తోట
మండపేట, ఆగస్టు 13: కోనసీమ జిల్లా పేరు మార్పు సమయంలో అమలాపురంలో జరిగిన అల్లర్లు దురదృష్టకరం. ఈ కేసుల్లో ఇరుకుక్కన్న అమాయకులైన వారికి కేసుల నుంచి విముక్తి కల్పిస్తామని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చెప్పారు. మండపేటలో వీరు శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రమంత్రి పినిపే విశ్వరూప్, ముమ్మి డివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ల ఇళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టి విధ్వంసం సృష్టించిన సంఘటన నేపఽథ్యంలో నేతలు మాట్లాడారు. అల్లర్లకు సంబంధించి 300 మందిపై పోలీసు కేసులు నమోదు కాగా, వారిలో కొందరికి బెయిల్ మంజురైందని, మరికొంతమందికి బెయిల్ రావాల్సి ఉందన్నారు. బెయిల్ మంజూరుకానీ వారి కుటుంబ సభ్యులు శెట్టిబలిజ, కాపు సామాజిక వర్గాల నేతల ద్వారా తమ వద్దకు వచ్చి తమ పిల్లలు పడుతున్న ఆవేదన వెళ్లబుచ్చుకున్నారని వారు తెలిపారు. అల్లర్ల కేసులో అమా యకులైన వారిపై కేసుల గురించి సీఎం జగన్ దృష్టికి తీసుకు వెళతామని, అప్పటివరకు అంతా సం యమనం పాటించాలని వారు కోరారు. అమలాపురం సంఘటనను అన్ని వర్గాలు, ప్రజల సహకారంతో శాంతియుతంగా పరిష్కరించుకోవాల్సి ఉందన్నారు. అల్లర్ల కేసులో అమయాకులెవరో, దోషులెవరో పోలీ సులు నిర్ధారించి నిర్దోషులను వదిలేయాలని పోలీసులకు సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ నూకదుర్గారాణి, వేగుళ్ల పట్టాభిరామయ్యచౌదరి తదితరులు పాల్గొన్నారు.