ఫిబ్రవరిలో గోదావరి బాలోత్సవాలు: సాబ్జీ

ABN , First Publish Date - 2022-12-16T00:41:12+05:30 IST

బాలల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి బాలోత్సవాలు దోహదం చేస్తాయని ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ అన్నారు.

ఫిబ్రవరిలో గోదావరి బాలోత్సవాలు: సాబ్జీ

రాజమహేంద్రవరం అర్బన్‌, డిసెంబరు 15 : బాలల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి బాలోత్సవాలు దోహదం చేస్తాయని ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ అన్నారు. రాజమహేంద్రవరం ఎస్‌కేవీటీ డిగ్రీ కళాశాలలో గురువారం గోదావరి బాలోత్సవ సన్నాహక సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం క్రిస్మస్‌, సంక్రాంతి పండుగలు, పరీక్షలను దృష్టిలో ఉంచుకుని వచ్చే ఏడాది ఫిబ్రవరి మూడో వారంలో గోదావరి బాలోత్సవాలు నిర్వహించడానికి సన్నాహక కమిటీ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ సమావేశంలో కన్వీనర్‌ తులసి, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T00:41:13+05:30 IST