భవిష్యత్తు సవాళ్లను న్యాయబద్ధంగా ఎదుర్కొంటాం

ABN , First Publish Date - 2022-08-04T06:57:12+05:30 IST

భవిష్యత్తులో ఎటు వంటి సవాళ్లు ఎదురైనా న్యాయబద్ధంగా ఎదుర్కొంటా మని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జిల్లా సాధన సమితి చైర్మన్‌ డీబీ లోక్‌ పేర్కొన్నారు.

భవిష్యత్తు సవాళ్లను న్యాయబద్ధంగా ఎదుర్కొంటాం

అమలాపురం టౌన్‌, ఆగస్టు 3: భవిష్యత్తులో ఎటు వంటి సవాళ్లు ఎదురైనా న్యాయబద్ధంగా ఎదుర్కొంటా మని డాక్టర్‌ బీఆర్‌  అంబేడ్కర్‌ జిల్లా సాధన సమితి చైర్మన్‌ డీబీ లోక్‌ పేర్కొన్నారు. ఈదరపల్లిలో బుధవారం సాధన సమితి అత్య వసర సమావేశాన్ని ఆయన అధ్య క్షతన నిర్వహించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేరిట గెజిట్‌ విడుదల చేసిన ప్రభు త్వానికి కృతజ్ఞతలు తెలి పారు. భవిష్యత్తు కార్యక్రమాలు నిర్వ హించేందుకు త్వరలో జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేసేందుకు, అన్ని మండలాల్లోను, గ్రామాల్లోను ప్రజలంతా సంయ మనం పాటించేందుకు తీర్మానించారు. పంచాయతీ కార్యదర్శి రొడ్డా భవాని ఆత్మహత్యకు కారకులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని, డీఎస్పీని బర్తరఫ్‌ చేయాలని, ఈకేసును పూర్తిగా మేజిస్ట్రేట్‌తో విచారణ జరిపించాలని డిమాండు చేశారు.  కన్వీనర్‌ జంగా బాబూరావు, ప్రధాన కార్యదర్శి ఇసుకపట్ల రఘుబాబు, నాయకులు రేవు తిరుపతిరావు, పెయ్యల పరశురాముడు, బొంతు రమణ, ములపర్తి సత్యనారాయణ, కాకర శ్రీనివాసరావు, మద్దా చంటిబాబు, గిడ్డ వెంకటేశ్వరరావు  పాల్గొన్నారు. 



Updated Date - 2022-08-04T06:57:12+05:30 IST