ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి

ABN , First Publish Date - 2022-12-12T01:03:54+05:30 IST

మాండస్‌ తుపాను కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కల్లాల్లోనే ధాన్యం నీట మునిగిందని, ప్రభుత్వం రైతులను అన్ని విధాల ఆదుకోవాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కోరారు.

ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి

కొత్తపేట, డిసెంబరు 11: మాండస్‌ తుపాను కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కల్లాల్లోనే ధాన్యం నీట మునిగిందని, ప్రభుత్వం రైతులను అన్ని విధాల ఆదుకోవాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కోరారు. ఆదివారం ఆయన నీట మునిగిన వరిచేలను, కల్లాల్లో ధాన్యం రాశులను స్వయంగా పరిశీలించి రైతుల గోడు విన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాలను అంచనా వేయాలన్నారు. రైతులెవ్వరూ నష్టపోకుండా ధాన్యం కొనుగోలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. గ్రామాల్లో అపారిశుధ్యం వల్ల సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్నాయని, పంచాయతీలకు తక్షణం నిధులు విడుదల చేయాలని బండారు కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కంఠంశెట్టి శ్రీను, యల్లమిల్లి జగన్మోహన్‌, త్సామా బాబు, నల్లా వెంకటరమణ, బండారు వీరబాబు, కడియం చిన్నా, బండారు రాజేష్‌, పల్లి ఏసు, బహదూర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-12T01:03:54+05:30 IST

Read more