వలంటీర్‌ వ్యవస్థతో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు

ABN , First Publish Date - 2022-12-31T22:40:57+05:30 IST

వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు చేరాలని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. శనివారం కొవ్వూరులోని లిటరరీ క్లబ్‌ కల్యాణ మండపంలో కొవ్వూరు మున్సిపాల్టీ, కొవ్వూరు మండలం, చాగల్లు మండలాలకు చెందిన వలంటీర్లు, వైసీపీ వార్డు కన్వీనర్లతో సమావేశం నిర్వహించారు.

వలంటీర్‌ వ్యవస్థతో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు

కొవ్వూరు, డిసెంబరు 31: వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు చేరాలని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. శనివారం కొవ్వూరులోని లిటరరీ క్లబ్‌ కల్యాణ మండపంలో కొవ్వూరు మున్సిపాల్టీ, కొవ్వూరు మండలం, చాగల్లు మండలాలకు చెందిన వలంటీర్లు, వైసీపీ వార్డు కన్వీనర్లతో సమావేశం నిర్వహించారు. మంత్రి వనిత మాట్లాడుతూ దేశంలో ఏపీలోనే సీఎం జగన్‌ వలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చారన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా వలంటీర్ల వ్యవస్థను తీసుకురావడంతో వైసీపీ నాయకులకు ఎక్కడా అవినీతి మరక అంటకుండా, కడిగిన ముత్యాలలా ఉన్నార న్నారు. డోర్‌ టు డోర్‌ తిరుగుతుంటే చాలా సమస్యలు వస్తున్నాయని, ప్రజలు పింఛను ఎవరు ఇస్తున్నారని అడుగుతుంటే వలంటీర్లు ఇస్తున్నారని చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సంక్షేమ పథకాలు ఎవరు అందిస్తున్నారో లబ్ధిదారులకు ఎందుకు చెప్పడం లేదన్నారు. మండలంలో ఉన్న చైతన్యం టౌన్‌లో కల్పించడం లేదన్నారు. రాజమహేంద్రవరంలో జనవరి 3న ముఖ్యమంత్రి సమావేశం ఉన్నందున నియోజకవర్గంలో పింఛన్లు 3వ తేదీ తర్వాత అందజేస్తామన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి మూడున్నరేళ్లలో ప్రభుత్వ పథకాల లబ్ధిని తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బావన రత్నకుమారి, బండి పట్టాభి రామారావు, కోడూరి శివరామకృష్ణ, ముదునూరి నాగరాజు, సుంకర సత్యనారాయణ, రుత్తల భాస్కరరావు, మారిన రామకృష్ణ, ఏలూరి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T22:40:57+05:30 IST

Read more