ఉద్యోగులకు సీఎం క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలి

ABN , First Publish Date - 2022-08-31T06:30:52+05:30 IST

ఎన్నికల ముందు అబద్దపు హామీ ఇచ్చి ఉద్యోగ ఉపాధ్యాయుల హక్కులను కాలరాస్తున్న సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఉద్యోగ, ఉపాధ్యాయులకు భేషరతుగా క్షమాపణ చెప్పి తన పదవికి రాజీనామా చేయాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు.

ఉద్యోగులకు సీఎం క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలి

టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి 

అనపర్తి, ఆగస్టు 30 : ఎన్నికల ముందు అబద్దపు హామీ ఇచ్చి ఉద్యోగ ఉపాధ్యాయుల హక్కులను కాలరాస్తున్న సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఉద్యోగ, ఉపాధ్యాయులకు భేషరతుగా క్షమాపణ చెప్పి తన పదవికి రాజీనామా చేయాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి  రామకృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళ వారం అనపర్తిలోని పార్టీ కార్యాలయం లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావే శంలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా ఉద్యోగులు,  ఉ.పాధ్యాయులు తమ హక్కులకోసం చలో విజయవాడ కార్యక్రమం చేపడితే వారిని అణచివేసే విధంగా చర్యలు చేపట్టడం దారుణమైన చర్య అని అన్నారు. ఒకప్పుడు గంజాయి, సారా వంటి వాటిని అరికట్టేందుకు చెక్‌ పోస్టులు పెట్టేవారని నేడు ఉద్యోగ, ఉపాధ్యాయులను అడ్డుకోవడంకోసం చెక్‌పోస్టులు ఏర్పాటుచేసే పరిస్థితి వచ్చింద న్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు కొవ్వూరి శ్రీనివాసరెడ్డి, తమలంపూడి సుధాకరరెడ్డి, కర్రి వెంకటరామారెడ్డి, సత్తి దేవదానరెడ్డి, ఒంటిమి సూర్యప్రకాష్‌, మామిడి శెట్టి శ్రీను, నూతిక  బాబూరావు కర్రి వెంకటరెడ్డి పాల్గొన్నారు.

చవితి వేడుకలకు ఆంక్షలు విధించడం సమంజసం కాదు 

జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం వినాయక చవితి వేడుకలపై ఆంక్షలు విధించడం హేయమైన చర్య అని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నా రు. మంగళవారం మండలంలోని రామవరంలో ఆయన విలేకరులతో మా ట్లాడుతూ బ్రిటీష్‌ ప్రభుత్వం కూడా విధించని ఆంక్షలను నేడు రాష్ట్ర ప్రభుత్వం వినాయక చవితి వేడుకలపై  విధిస్తుందన్నారు. 75 సంవత్సరాల స్వాంతంత్య్ర చరిత్రలో వినాయక చవితి ఉత్సవాలపై ఆంక్షలు విధించిన ప్రభుత్వం జగ న్మోహనరెడ్డి ప్రభుత్వమేనన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలను అరిక ట్టడంపై పోలీసులు చొరవ చూపాలని ఆయన సూ చించారు. వినాయక చవితి ఉత్సవాలపై విధించిన ఆంక్షలను వెంటనే  ఉపసంహరించు కోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.


Read more