విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-09-10T06:21:42+05:30 IST

సీతానగరం మండలం సింగవరంలో శుక్రవారం ఉదయం విద్యుతాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. దోసకాయలపల్లికి చెందిన దొండపాటి బాలకృష్ణ (26) సింగవరంలో ఓ రైతుకు చెందిన పామాయిల్‌ తోటలో పామాయిల్‌ గెలలు కోసే పనికి వచ్చాడు.

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

సీతానగరం, సెప్టెంబరు 9: సీతానగరం మండలం సింగవరంలో శుక్రవారం ఉదయం విద్యుతాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. దోసకాయలపల్లికి చెందిన దొండపాటి బాలకృష్ణ (26) సింగవరంలో ఓ రైతుకు చెందిన  పామాయిల్‌ తోటలో పామాయిల్‌ గెలలు కోసే పనికి వచ్చాడు. గెలలు కోస్తుండగా విద్యుత్‌ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. బాలకృష్ణ భార్య ప్రస్తుతం గర్భిణి కాగా 14 నెలలు పాప ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ శుభశేఖర్‌ తెలిపారు.

Read more