విద్యుత్‌ షాక్‌తో టెన్త్‌ విద్యార్థి మృతి

ABN , First Publish Date - 2022-09-10T06:20:45+05:30 IST

ప్రత్తి పాడులో విద్యుత్‌ షాక్‌కు గురై పదో తరగతి విద్యార్థి మృతిచెందాడు. స్థానిక హైస్కూల్లో చదువుతున్న తోట శ్రీ గణేష్‌ గంగామణిదుర్గపవన్‌ శుక్ర వారం తన ఇంటి సమీపంలో విద్యుత్‌ సరఫరా ఇనుపరాడ్‌ను పట్టుకోవడంతో ప్రమాదానికి గురై మృతిచెందాడు.

విద్యుత్‌ షాక్‌తో టెన్త్‌ విద్యార్థి మృతి

ప్రత్తిపాడు, సెప్టెంబరు 9: ప్రత్తి పాడులో విద్యుత్‌ షాక్‌కు గురై పదో తరగతి విద్యార్థి మృతిచెందాడు.   స్థానిక హైస్కూల్లో చదువుతున్న తోట శ్రీ గణేష్‌ గంగామణిదుర్గపవన్‌ శుక్ర వారం తన ఇంటి సమీపంలో విద్యుత్‌ సరఫరా ఇనుపరాడ్‌ను పట్టుకోవడంతో ప్రమాదానికి గురై మృతిచెందాడు. గణేష్‌కు తండ్రి లేడు. తల్లి కుట్టు మిషన్‌ పనిచేస్తూ పోషి స్తోంది. ఒక్క గానొక్క కుమారుడు మృతిచెందడంతో ఆమె కన్నీరు మున్నీరుగా విల పిస్తోంది. తోడు ఉంటాడనుకున్న కొడు కు ఇలా దూరమైపోయాడని రోది స్తోంది.

Read more