హౌసింగ్‌ను వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-05-24T07:06:26+05:30 IST

రాజమహేంద్రవరం, మే 23 (ఆంధ్రజ్యోతి): హౌసింగ్‌ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ కె.మాధవీలత ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం సాయంత్రం హౌసింగ్‌, ఉపాధి హామీ డేటా, లేఅవుట్లలో ఫేజ్‌-2 పనులు, ఓటీఎ స్‌, ఎన్‌పీఐ, నవరత్నాల్లో పేదలందరికీ ఇళ్లు, రెవెన్యూ తదితర శాఖల అధికారులలో ఆమె సమీక్షించారు. అన్ని పనుల మీద ముందు అవగాహన పెంచుకోవాలన్నారు. అనపర్తి, బిక్కవోలు, రాజానగరం, కోరు

హౌసింగ్‌ను వేగవంతం చేయాలి
అధికారుల సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ మాధవీలత

అధికారుల సమీక్షలో కలెక్టర్‌ కె.మాధవీలత

రాజమహేంద్రవరం, మే 23 (ఆంధ్రజ్యోతి): హౌసింగ్‌ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ కె.మాధవీలత ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం సాయంత్రం హౌసింగ్‌, ఉపాధి హామీ డేటా, లేఅవుట్లలో ఫేజ్‌-2 పనులు, ఓటీఎ స్‌, ఎన్‌పీఐ, నవరత్నాల్లో పేదలందరికీ ఇళ్లు, రెవెన్యూ తదితర శాఖల అధికారులలో ఆమె సమీక్షించారు. అన్ని పనుల మీద ముందు అవగాహన పెంచుకోవాలన్నారు. అనపర్తి, బిక్కవోలు, రాజానగరం, కోరుకొండ, పెరవలి, ఉండ్రాజవరం, తాళ్లపూడి, కొవ్వూరు, నిడదవోలు అర్బన్‌, రూరల్‌ మండలాల్లో గ్రామాల వారీగా ఇళ్ల పెండింగ్‌ పనులు సమీక్షించారు. ఇంజనీర్లు సమగ్రంగా అధ్యయనం చేసి,  గ్యాప్స్‌ లేకుండా చూడాలన్నారు. లేఅవుట్లలో విద్యుత్‌, మంచినీరు, లెవెలింగ్‌, అనుసంధాన రహదారులు వంటి వసతులు కల్పించాలని ఆదేశించారు. తాళ్లపూడి మండలంలోని 10 లేఅవుట్లలో జలజీవన్‌ మిషన్‌ కింద టెండరు పనులు వేగవంతం చేయాలన్నారు. నిడదవోలులో భూమి లెవిలింగ్‌ పూర్తి చేయాలన్నారు. హౌసింగ్‌ డీఈలకు రివైజ్డ్‌ స్టేటస్‌ అప్‌లోడ్‌ చేయడం కోసం మరోసారి లాగిన్‌ ఇచ్చామని, వెంటనే డేటా నమోదు చేయాలన్నారు. ఈ సమావేశంలో జేసీ శ్రీధర్‌, ఆర్డీవోలు ఎస్‌.మల్లిబాబు, ఎ.చైత్రవర్షిణి, డీహెచ్‌ తారాచంద్‌, డ్వామా పీడీ జగదాంబ, డీఎల్‌డీవో రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.

Read more