రీ సర్వే ప్రక్రియ వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-07-05T07:18:00+05:30 IST

రాజమహేంద్రవరం, జూలై 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో జగనన్న భూహక్కు, భూరక్ష పథకంలో భాగంగా చేపట్టిన రీసర్వే పనులను ప్రామాణికతతో వేగవంతం చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత ఆదే శించారు. స్థానిక కలక్టరేట్‌లో సోమవారం పంచాయతీ, రెవెన్యూ అధికారులతో ఆమె జేసీ శ్రీధర్‌తో కలసి రీసర్వేపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 272 గ్రామాల్లో రీసర్వే పనులు మొదలుపెట్టగా 28 గ్రా

రీ సర్వే ప్రక్రియ వేగవంతం చేయాలి
జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న కలెక్టర్‌ మాధవీలత

28 గ్రామాల్లో పూర్తి 8 కలెక్టర్‌ కె.మాధవీలత

రాజమహేంద్రవరం, జూలై 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో జగనన్న భూహక్కు, భూరక్ష పథకంలో భాగంగా చేపట్టిన రీసర్వే పనులను ప్రామాణికతతో వేగవంతం చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత ఆదే శించారు. స్థానిక కలక్టరేట్‌లో సోమవారం పంచాయతీ, రెవెన్యూ అధికారులతో ఆమె జేసీ శ్రీధర్‌తో కలసి రీసర్వేపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 272  గ్రామాల్లో రీసర్వే పనులు మొదలుపెట్టగా 28 గ్రామాల్లో పూర్తి చేశామన్నారు. ఇక్కడ 13 నోటిఫికేషన్లు జారీ చేశామన్నారు. 73 గ్రామాల్లో డ్రోన్‌ సహాయంతో సర్వే చేసినట్టు తెలిపారు. రెవెన్యూ గ్రామాల పరిధిలో ఫ్రీజోన్‌ యాక్టివిటీస్‌ కింద భూముల సరిహద్దులు సంప్రదాయ పద్ధతిలో సున్నం మార్కింగ్‌ చేసి పూర్తి చేసినట్టు చెప్పారు. 43 గ్రామాల్లో ఆర్ధోరెక్టిఫైడ్‌ ఇమేజ్‌ (ఓఆర్‌) ఇచ్చిన 100 రోజుల్లో సర్వే పూర్తిచేయాలని ఆదేశించారు. 21 గ్రామాల్లో డ్రాప్‌ ఆర్వో పూర్తి చేశామన్నారు. కడియంలో 7, గోకవరంలో 15,  రాజానగరంలో 14,  రంగంపేటలో 14, సీతానగరంలో 17, కోరుకొండలో 19,  రూరల్‌ మండలంలో 7 గ్రామాల్లో డ్రోన్‌ సర్వే చేశామన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవో ఏ. చైత్రవర్షిణి, ఏడీ సర్వే లక్ష్మణరావు, డీపీవో సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


భవనాల నిర్మాణంలో మెరుగ్గా లేం

ప్రాధాన్యతా భవనాల్లో  పెండింగ్‌ లేకుండా చూడాలి

మండల స్థాయి అధికారులతో 

జూమ్‌ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ కె.మాధవీలత

 రాజమహేంద్రవరం, జూలై4 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ప్రాధాన్యతా భవనాలైన ఆర్‌బీకేలు, హెల్త్‌క్లినిక్‌లు, సచివాలయ భవనాలు తదితర నిర్మాణాలను పూర్తి చేయడంలో మెరుగైన స్థానంలో లేవమన్న వాస్తవాన్ని గుర్తించాలని, ఎక్కడ, ఎందుకు, ఏ పని పెండింగ్‌ ఉందో గుర్తించి వెంటనే వారి పరిష్కార మార్గాలతో ముందుకు వెళ్లి, లక్ష్యాలు సాధించాలని కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత  ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌ నుంచి సోమవారం ఆమె జూమ్‌ కాన్ఫరెన్స్‌లో మండల స్థాయి అధి కారులతో మాట్లాడారు. ఇటీవల ఉద్యోగుల బదిలీల నేపథ్యంలో ఈ పనులు పూర్తి చేయడానికి  లభించిన గడువును సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఓటీఎస్‌ దరఖాస్తులు ఇంకా 2148 పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. తహశీల్దార్లు, ఎంపీడీవోలు, పీ ఆర్‌ ఏఈలు తక్షణం కూర్చుని పెండింగ్‌ పనులు పూర్తి చేసే అవకాశాలపై చర్చించి ఒక నివేదిక ఇవ్వాలన్నారు. భూసమస్య వల్ల ఆగినవి కాకుండా, మిగతావాటికి పరిష్కారం తప్పకుండా లభిస్తుందన్నారు. సమర్థంగా పనులు చేసిన అనుభవాన్ని పెండింగ్‌ పనులు పూర్తికి జోడించాలని కోరారు.


కలెక్టరేట్‌ స్పందనకు 122 అర్జీలు

ధవళేశ్వరం, జూలై4 : స్పందనలో వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్క రించి బాధితులకు తగిన న్యాయం జరి గేలా చూడాలని జిల్లా కలెక్టర్‌ మాధవీ లత అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందనలో కలెక్టర్‌ మాధ వీలతోపాటు జేసీ సీహెచ్‌ శ్రీధర్‌, డీఆర్వో సుబ్బారావు ఫిర్యాదులు స్వీక రించారు. సోమవారం 122 ఫిర్యాదులు వచ్చాయని కలెక్టర్‌ తెలిపారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా  పరిశీలించి పరిష్కరిం చాలని ఏ ఒక్క అర్జీ తిరిగి రాకుండా చూడాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె ఈ సందర్భంగా హెచ్చరించారు.

Read more