మెడికల్‌ కళాశాల పనులు వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-12-16T00:16:29+05:30 IST

రాజమహేంద్రవరం మెడికల్‌ కళాశాల పనులు మరింత వేగవంతం చేయాలని అకడమిక్‌ డీఎంఈ సత్యవరప్రసాద్‌ అన్నారు.

మెడికల్‌ కళాశాల పనులు వేగవంతం చేయాలి
రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలోతనిఖీలు చేస్తున్న డీఎంఈ

రాజమహేంద్రవరం అర్బన్‌, డిసెంబరు 15 : రాజమహేంద్రవరం మెడికల్‌ కళాశాల పనులు మరింత వేగవంతం చేయాలని అకడమిక్‌ డీఎంఈ సత్యవరప్రసాద్‌ అన్నారు. రాజమహేంద్రవరం సర్వజన ఆసుపత్రిని గురువారం రాత్రి ఆయన సందర్శించారు. పలు విభాగాలను తనిఖీ చేశారు. ముందుగా జడ్జి బంగ్లా రిజర్వాయర్‌ ప్రాంతంలో జరుగుతున్న ప్రీ ఇంజనీరింగ్‌ బిల్డింగ్‌ పనులు పరిశీలించి వేగవంతం చేయాలన్నారు. అనంతరం ఆసుపత్రిలోని వివిధ విభాగాలను తనిఖీ చేశారు. ఓపీ కారిడార్‌, ఐసీయూ, వార్డుల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రమేష్‌ మెడికల్‌ కాలేజీకి సంబంధించి చేపడుతున్న ఆధునీకరణ పనుల గురించి వివరించారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.అకడమిక్‌ డీఎంఈతో పాటు ఏపీఎస్‌ఎంఐడీసీ ఇంజనీరింగ్‌ అధికారులు సుబ్రహ్మణ్యం, కృష్ణారెడ్డి ఉన్నారు.

Updated Date - 2022-12-16T00:16:31+05:30 IST