సోలార్‌ రూపింగ్‌ భవనాలు ప్రారంభించిన డిప్యూటీ సీఎం

ABN , First Publish Date - 2022-11-08T01:31:25+05:30 IST

రాజమహేంద్రవరం గౌతమి జీవకారుణ్య సంఘం వృద్ధాశ్రమ ప్రాంగణంలో రూ. కోటి వ్యయంతో సోలార్‌ రూపింగ్‌తో నిర్మించిన మూడు బహుళ ప్రయోజనకర భవనాలను డిప్యూటీ సీఎం కె నారాయణ ప్రారంభించారు. సోమవారం సా

సోలార్‌ రూపింగ్‌ భవనాలు ప్రారంభించిన డిప్యూటీ సీఎం
జీవకారుణ్య సంఘంలో భవనాలు ప్రారంభిస్తున్న డిప్యూటీ సీఎం నారాయణ

రాజమహేంద్రవరం సిటీ, నవంబరు 7: రాజమహేంద్రవరం గౌతమి జీవకారుణ్య సంఘం వృద్ధాశ్రమ ప్రాంగణంలో రూ. కోటి వ్యయంతో సోలార్‌ రూపింగ్‌తో నిర్మించిన మూడు బహుళ ప్రయోజనకర భవనాలను డిప్యూటీ సీఎం కె నారాయణ ప్రారంభించారు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి ఆయన, ఎంపీ మార్గాని భరత్‌రామ్‌, రుడా చైర్‌పర్సన్‌ మేడపాటి షర్మిళారెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్‌ దినేష్‌కుమార్‌లు ముఖ్య అతిఽథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం నారాయణ మాట్లాడుతూ బధిరులు, అనాఽథలు, వృద్ధుల కోసం మంచి భవనాలను నిర్మించిన ఎంపీకి అభినందనలు తెలిపారు. ఎంపీ భరత్‌రామ్‌ మాట్లాడుతూ గౌతమి జీవకారుణ్య సంఘం పరిధిలో 19 ఎకరాల భూమిని దాతలు వృద్ధుల సంక్షేమం కోసం ఇచ్చారని, దాతల ఆశయాలకు అనుగుణంగా దాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. వృద్ధు లకోసం ఒక పార్కు, గోశాలను నిర్మిస్తామన్నారు. అలాగే నగరంలో ఉన్న యాచకుల కోసం ఒక డార్మెంటరీ నిర్మించి బెగ్గర్‌ ఫ్రీ సిటీగా రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్‌, గాండ్ల తెలుకుల కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ సంకిస భవానిప్రియ, నేతలు మజ్జి అప్పారావు, టీకే విశ్వేశ్వరరెడ్డి, డాక్టర్‌ అనసూరి పద్మలత, ఎండీ ఆరిఫ్‌, గేడి అన్నపూర్ణరాజు పాల్గొన్నారు.

పవన్‌కల్యాణ్‌ను రాజకీయ నాయకుడిగా మేము గుర్తించం..

జనసేన అధినతే పవన్‌కల్యాణ్‌ను తాము ఒక రాజకీయ నాయకుడిగా గుర్తించడం లేదని మాజీ డిప్యూటీ సీఎం కె నారాయణ అన్నారు. రాజమహేంద్రవరంలో విలేకరులతో మాట్లాడుతూ తమ దృష్టిలో పవన్‌ రాజకీయ నాయకుడు కాదని పేర్కొన్నారు.

Updated Date - 2022-11-08T01:31:25+05:30 IST

Read more