పని ఒత్తిడి తగ్గించండి

ABN , First Publish Date - 2022-12-13T01:27:28+05:30 IST

విధుల్లో పని ఒత్తిళ్లను తగ్గించాలని కోరుతూ మండలంలోని వీఆర్వోలు స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సోమవారం నిరసన దీక్షకు ఉపక్రమించారు. ఈ సందర్భంగా వీఆర్వోల సంఘం అధ్యక్షుడు జాన్‌, కార్యదర్శి సానా శ్రీను మాట్లాడుతూ ప్రభుత్వం వీఆర్వోలపై రోజురోజు కు పనిభారం మోపుతూ ఒత్తిడికి గురిచేస్తోందన్నారు. పని భారం తట్టులేక కొందరు వీఆర్వోలు గుండెపోటుకు గురై మరణిస్తున్నారన్నారు.

పని ఒత్తిడి తగ్గించండి
బిక్కవోలులో ఆందోళన చేస్తున్న వీఆర్వోలు

  • వీఆర్వోల నిరసన ప్రదర్శన.. తహశీల్దార్లకు వినతిపత్రాలు

రాజానగరం, డిసెంబరు 12: విధుల్లో పని ఒత్తిళ్లను తగ్గించాలని కోరుతూ మండలంలోని వీఆర్వోలు స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సోమవారం నిరసన దీక్షకు ఉపక్రమించారు. ఈ సందర్భంగా వీఆర్వోల సంఘం అధ్యక్షుడు జాన్‌, కార్యదర్శి సానా శ్రీను మాట్లాడుతూ ప్రభుత్వం వీఆర్వోలపై రోజురోజు కు పనిభారం మోపుతూ ఒత్తిడికి గురిచేస్తోందన్నారు. పని భారం తట్టులేక కొందరు వీఆర్వోలు గుండెపోటుకు గురై మరణిస్తున్నారన్నారు. పని ఒత్తిడి కారణంగా చనిపోయిన వీఆర్వోల కుటుంబాలకు రూ.25 లక్షలు ఆర్థిక సాయం అందించాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. మట్టి ఖర్చులు కూడా ఇవ్వడం లేదన్నారు. వీఆర్వోలకు సెలవు, పండగ రోజుల్లో విధులు చెప్పకుండా అధికారులు ఆదేశాలు జారీచేసేలా చర్యలు చేపట్టాల న్నారు. అలాగే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వీఆర్వోల పోస్టులను అర్హులైన వీఆర్‌ఏ లతో భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం తహశీ ల్దార్‌ పవన్‌కు మార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వీఆర్వోల సంఘం జిల్లా జా యింట్‌ సెక్రటరీ గన్నిరాజు, జాయింట్‌ సెక్రటరీ షారా, వీఆర్వోలు కె.నాగేశ్వర రావు, చినబాబు, హరిమోహన్‌, శ్రీనివాసు, ముని తిరుపతి పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T01:27:29+05:30 IST